ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు గడ్డపై వెలసిన సాంఘిక సంస్కర్తలు ఇద్దరే ఇద్దరు. ఒకరు కందుకూరి వీరేశలింగం పంతులుగారు, గురజాడ అప్పారావుగారు. కందుకూరి, గురజాడ బ్రాహ్మణకుటుంబంలోనే జన్మించారు. ఆనాటికి ఉండే సాంఘిక దురాచారాలను అరికట్టేందుకు ఇద్దరు తీవ్రమైన కృషిజరిపారు. అవి ఆనాటికీ, ఈనాటికీ చరిత్రలో చిరస్మరణీ యంగా నిలచి పోయేవే ! కందుకూరి, గురజాడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ బ్రాహ్మణ్యం వారిలో కలిగుండ లేదు. సమసమాజ నిర్మాణం కోసం సమాజంలో గల కుళ్ళుకుతంత్రాలను కడిగి పారేసారు. ' కన్యక' లో రాజుల యెడ తన మనోభావాలను తన రచనలలో ప్రస్ఫుటింపజేసాడు గురజాడ. ఈ క్రింది కవితలను ఒకసారి పరిశీలిద్దాం. '' పట్టమేలే రాజు అయితే/రాజునేలే దైవముండడొ/పరువు నిలపను పౌరుషము మీ/కేల కలగదొకో ?" " విద్య నేర్చిన వాడు విప్రుడు/వీర్య ముండిన వాడు క్షత్రియు/డన్న పెద్దల ధర్మపద్ధతి/మరచి, పదవులకై". " పట్టపగలే, వీధినిపట్టబోరే జార చోరులు/పట్టదలచితి వింక నీవొక/పట్టమేలే రాజువట!" కండకావర మెక్కి నీవీ/దుండగము తలపెట్టినందుకు/వుండడా నొక దైవమంటూ/వుండి వూర్కొనుమా?" ఇలా గురజాడ వారి "కన్యక " లో చివరి అయిదు రచనలు చదవ వలసిందే ! సమయాభావం వలన ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్థావించ దలచలేదు. ఇక గురజాడ వారి " లవణరాజు కల" కొద్దాం. ఇందులో గురజాడ వారు దళిత జీవితాన్నిచిత్రీకరించారు. సంఘసంస్కరణోద్యమానికి మన తెలుగుగడ్డ నుండి కృషి చేసినవారు కందుకూరివారు, గురజాడవారు. కుల ప్రశక్తిలేని భారతదేశం ఆయన కావాలంటారు.అస్పృశ్యత పూర్తిగా నిర్మూలించాలనీ, అందుకు కులాంతరవివాహమొక్కటే మార్గమని, ఆనాడే లౌకిక సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని గురజాడవారు చెప్పారు. '' ముత్యాలసరములు " కవితలో గురజాడ సహపంక్తి భోజనాలు, కుల నిర్మూలన గురించి ఒక కవితలో తన మనసులో భావాలను వ్యక్త పరచుతాడు. అదేమిటంటే ఒకనాడు ఒక భర్త సహపంక్తి భోజనానికి వెళ్లి ఎంతో ఉల్లాసంగా భార్యతో చెప్తాడు ఆలస్యానికి గలకారణం. ఆ సందర్భంగాఆ భార్య అంటుందిలా-- " కలిసి మెసగిన యంత మాత్రనె/కలుగబోదీ యైకమత్యము/మాలమాదిగ కన్నె నెవతనొ/మరులు గొనరాదో ?" అని. కలసిమెలసి సహపంక్తి భోజనం చేసినంత మాత్రాన దళిత కులాల స్ర్తీలను చేసుకున్నప్పుడుమాత్రమే లౌకిక సమాజ నిర్మాణం,సమాజ నిర్మాణం సాధ్యంఅవుతుందనే భావన ఆమె మాటల్లో ద్యోతకమవుతుంది. 1915లో గురజాడ మరణిస్తాడు.భారతరాజ్యాంగ నిర్మాత, అనేక పట్టాలను పొందిన బహు మేథావి, దళిత జాతికి చెందిన వ్యక్తి లౌకిక రాజ్య స్థాపనకు, సమసమాజ నిర్మాణానికి గురజాడవారి ఆశయాలనే వల్లెవేసాడు. గురజాడ కోరినట్టే అంబేద్కర్ కూడా సాంఘిక విప్లవం రావాలి అంటాడు. అప్పుడే కుల మత బేధాలు సమసిపోతాయనీ‌ ,ఆనాడే ఆర్థిక, సాంఘిక, రాజకీయ విప్లవం రాగల అవకాశంఉంటుందని భారతీయుల మధ్య సోదర భావం కలగాలంటే కుల నిర్మూలన జరగాలనీ, వన భోజనాలు కావు అని నిక్కచ్చిగా చెబుతాడు. ఈ రచన ద్వారానే గురజాడను 'అత్యంత దా‌ర్శనికుడు,సాంఘిక సంస్కరణలవిప్లవకారుడు అని మనం చెప్పుకోవచ్చు. ( సశేషం ) -- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 701 3660 252.
July 25, 2020 • T. VEDANTA SURY • Memories