ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు తేజం --- పూవు పుట్టగానె పరిమళించినట్టు పరిఢవిల్లిన మంచి మనస్సు తూరుపు సూరీడి వెలుగు జగము నిండినట్టు వసుధనిండెను జ్ఞాన తేజస్సు భాషలెన్నొ నేర్చి బహుముఖ ప్రజ్ఞతో భరతదేశమునేలిన ప్రతిభ ఉషస్సు. వందలాది ఎకరాల భూమికాసామియైన కోట్లాది జనుల సేవలో తరించిన మేధస్సు మాంద్యమందున మందగించిన దేశానికి యోచనాలోచనా సులోచనమైన కీర్తి కాయముకేగాని వయసు మనసుకేదంటూ పట్టుదలతో కంప్యూటర్ కోడ్ నేర్చినట్టి వెలుగు అలుపెరుగని కృషి సల్పిన ధీశాలి. సంస్కరణల శోభతో వన్నె తెచ్చిన క్రియాశీలి. తెలుగు తేజమై మెరిసిన చైతన్యమూర్తి ఘనచరితను కలిగిన మేధోవికాసి. మాటల మూటలు కాదు ఆచరణ నేనని పలువిధాలుగ చాటిన పసిడి కాంతి. నిరాడంబర నిస్వార్థ ప్రజాసేవకా! పి.వి.నరసింహవర్య!ఆర్యా! సకల జనుల వందనములందుకోవయ్యా! మీ ఆశీస్సుల కిరణాలను మాపై ప్రసరింపజేయుమయా. పద్మ త్రిపురారి.
June 29, 2020 • T. VEDANTA SURY • Poem