ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు తేనియలు: -.జాధవ్ పుండలిక్ రావు పాటిల్-9441333315
October 31, 2020 • T. VEDANTA SURY • Poem
  • ఉత్తర దక్షిణ దిక్కులు రెండు
    అవి ఎదురెదురుగా ఉంటాయి
    మంచి చెడు గుణాలు మనలో
    పరస్పరం జీవిస్తాయి
  • భారత వీరజవాబులనులు
    అణిచినారు శత్రువుల పొగరు
    భరతమాత ముద్దు బిడ్డలు
    లేరు వీరికి సాటి ఎవరు
  • కార్గిలు యుద్ధ క్షేత్రంలో
    వీరమరణం పొందినారు
    నిద్రించారు అమ్మ  ఒడిలో
    జనుల ఎదలో నిలచినారు
  • దేహమందుండును ఆత్మయే
    తనువు విడిచి ఆత్మ పోవును
    ఆత్మ విడిచిన మేను శవము
    ఆత్మ లోన పరమాత్మ ఉండును
  • తెల్ల దొరల పొగరుఅణిచినాడు
    శాంతి,సత్యముతో గాంధీజీ
    దొరలకు చెమటలు పట్టించాడు
    భారత జాతిపిత గాంధీజీ
  • మాడిన పేగులకు తెలియును
    ఆకలి మంటల ఆరాటము
    గాయపడిన మనిషికి తెలియును
    గాయాల బాధల అనుభవము