ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు లెస్స..!'--(సేకరణ: సుజాత.పి.వి.ఎల్)..మిత్రులు కె.రఘు గారు పంపించారు. వారి అనుమతితో ...
August 31, 2020 • T. VEDANTA SURY • Poem

చదివే సమయంలో పెదవి మాత్రమే తగిలే పద్యం
భూమీ భామాంబు భవా
వామాపా వైభవ భువి భావావాపా
వేమమ్మోముము భూభవ
భీమ భవాభావ భావ విభువామావిభా

చదివే సమయంలో పెదవులు తగలనిది

శ్రీశా సతత యశః కవి
తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం
కాశా నిరతారాధిత
కీశేశా హృష్ణ గగనకేశా యీశా

ఒక అక్షరం పెదవికి తగలనిది తరువాతి అక్షరం తగిలేది
అంటే పెదవి తగలనిది, తగిలేది

దేవా శ్రీమాధవ శివ
దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా
జ్యావగ వంద్యా వాసవ
సేవితపద పగవిరామ శివ జపనామా

కేవలం నాలుక కదిలేది

సారసనేత్రా శ్రీధర
రారా నన్నేల నిందు రాక్షసనాశా
నారద సన్నుత చరణా
సారతరానందచిత్త సజ్జనరక్షా     

                                                                                                                                  
నాలుక కదలని (తగలని) పద్యాలు

కాయముగేహము వమ్మగు
మాయకు మోహింపబోకు మక్కువగ మహో
పాయం బూహింపుము వే
బాయగ పాపంబు మంకుభావమవేగా
భోగిపభుగ్వాహ మహా
భాగా విభవైకభోగ బావుకభావా
మేఘోపమాంగభూపా
బాగుగమముగావువేగ బాపాభావా

నాలుక కదిలీ కదలని పద్యం

ఓ తాపస పరిపాలా
పాతక సంహారా వీర భాసాహేశా
భూతపతిమిత్ర హరి ముర
ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా 
ఈ పద్యాలు రచించిన మహా కవులకు తెలుగు జాతి ఋణపడి వుంటుంది. . 

పద్య భాషాభిమానులకు జోహార్లు
అందుకే అన్నారు దేశభాషలందు తెలుగు లెస్స అని.!