ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు వెలుగు-అయిత అనిత 8985348424జగిత్యాల
September 26, 2020 • T. VEDANTA SURY • Poem

తెలుగంటే వెలుగురా
తేనెలొలుకు మధువురా

తెలుగు నేర్చి నీవురా
పండితునిగ మారరా

అజంతా భాషయై అవనిలోన నిలిచెరా
సంధులు సమాసాలతో సంబరమే తెచ్చెరా

పొడపుకథల తోడ మేధస్సును పెంచురా
సూక్తుల తోడ నైతికతను నేర్పురా

పాటల పల్లకిలో నిను ఊరేగించురా
కవనపు హరివిల్లులో ఊయలూపు నిన్నురా

కథలనే చెప్పి నీకు కాలక్షేపం చేయురా
పద్యాల పన్నీరుతో జలకాలాడించురా

తెలుగంటే వెలుగురా
తేనెలొలుకు మధువురా
అన్యభాషల మాయలోన
తెలుగును నువు మరువకురా