ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు వెలుగు-- అన్నాడి జ్యోతి.సిద్దిపేట.
September 11, 2020 • T. VEDANTA SURY • Poem

తెలుగు భాష మనదిరా!
తేనెలొలుకు భాషరా!
మధురమైన భాషరా!
సుధలు పంచు భాషరా!!

అమ్మ ఒడిన నేర్చినట్టి
కమ్మనైన భాషరా!!
అమ్మ గోరుముద్దతోని
నేర్పినట్టి భాషరా!!

అచ్చులు,హల్లులు,
ఉభయాక్షరాలు నేర్చుకో!
ముత్యమంటి చేతిరాత
ముదముతోడ నేర్చుకో!!

                !! తెలుగు!!

గుండ్రనైన అక్షరాలు
గుర్తింపును తెచ్చురా!
మాతృభాష మరువకూ
మన సంస్కృతి విడువకూ!!

మనసు లోని భావాలను
చెప్పుటెంతో సులువురా!!
సుందరమైనది తెలుగు
జ్ఞానమిచ్చు నా తెలుగు!!

           ‌!! తెలుగు!!

అన్య భాషలెన్ని యున్న
అమ్మ భాష తెలుగురా!!
తెలుగు పూల తోటలోన
వెలుగులు విరజిమ్మురా!!
           !! తెలుగు!!