ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు సాహిత్యం-కందుకూరి వీరేశలింగం -బెహరా ఉమామహేశ్వరరావు, సెల్ నెంబర్:9290061336*
August 23, 2020 • T. VEDANTA SURY • Serial

తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగిన కవిగా కందుకూరి వీరేశలింగం మహోన్నత సేవలందించి, సాహిత్య చరిత్రలో యుగ వైతాళికుడని ప్రసిద్దికెక్కాడు.కందుకూరి వీరేశలింగంగారి రచనలు:- ఈయన మొదట రాసిన రచనలు శతక సాహిత్య మే. మార్కండేయ శతకము, గోపాలస్వామి శతకము, రెండు కంద పద్య శతకాలే.ఇవిగాక ఈయన మరిన్ని రచనలు చేసారు.శుద్దాంధ్ర నిరోష్ఠ్యనిర్వచన నైషధం అనగా నల చరిత్రం,రసకజన మనోరజనం,శుద్ధాంధ్రోత్తర రామాయణం,అచ్చ తెలుగు సభాపర్వం లోని కొంత భాగంచెన్న పట్నం, సంజీవని వారిచే ప్రచురింపబడినది.సంగ్రహ వ్యాకరణం (1877-1934)ఈయన రాసిన ప్రహసనాలు:-మహారణ్య,పురాధిపత్యం,పంచతంత్రంలోని సంధి, విగ్రహము,1876జూలైలో వివేక వర్ధని పక్ష పత్రిక,ఈ సమయంలోనే,హాస్య సంజీవిని హాస్యరస పత్రిక ,తరువాతకాలంలో వివేక వర్ధనిలో భాగమై పోయింది.గుణాగుణ ప్రదర్శని  సమాజం-శీర్షిక, షేక్ స్పియర్మర్చంటాఫ్ వెనిస్, ఆంగ్ల నాటకాలకు కామెడీఆఫ్ ఎర్రర్స్  అనువాదాలు.నవలా రచనగా ,"రాజ శేఖర చరిత్ర" చెప్ప వచ్చును.శ్రీహర్ష విరచితమైన అనువాదనాటకం "రత్నావళి"."డ్యుయన్నా" నాటకాన్ని "రాగమంజరి"గాను రాసారు."ది రైవల్స్ " నాటకాన్ని తెలుగులో కళ్యాణ కల్పవల్లిగా రచించడం జరిగింది.కాళిదాసు కవిసంస్కృతంలో రాసిన "మాళవికాగ్ని మిత్రం"ను తెలుగులోనికి అనువాదించారు.సత్య హరిశ్చంద్ర, ప్రహ్లాద, దక్షిణ గోగ్రహణం, ఈయనరాసిన స్వతంత్ర నాటకాలు.మూడు భాగాలుగా720 మంది తెలుగు కవుల చరిత్రను రాసారు.   ఈయన కొందరు మహనీయుల జీవిత చరిత్రలనురాసారు.శంకరాచార్యులు,రామానుజాచార్యులు,మధ్వాచార్యులు,అహల్యా బాయి,రామమోహనరాయ్, అనిబిసెంట్ మరికొన్ని కూడా ఉన్నాయి. ఇవి గాక "సత్యవతి" సాంఘిక నవల రాశారు.మహత్తరమైన పురాణాలలోనే గాక ఆంగ్ల, సంస్కృత
అనువాదాలు, చారిత్రక, సామాజిక ఇతివృత్తాలనాధారంగా చేసుకుని పలు రచనలు చేశారు.(101వ భాగము ) సశేషం.