ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు సాహిత్యం-కందుకూరి వీరేశలింగం -- బెహరా ఉమామహేశ్వర రావు సెల్ నెంబర్: 9290061336,
September 24, 2020 • T. VEDANTA SURY • Serial

ఈ మహనీయుడు చేసిన సంఘసంస్కరణ
లలో వెన్నుదన్నుగా నిలిచిన గొప్పవారు, ఎందరో
ఉన్నారు. ఈయన ఆశయాలు స్త్రీ విద్య, మహిళలు తమ కాళ్ళపై నిలబడుతు, స్వతంత్ర జీవితం గడపడానికి, ఆర్థిక సముపార్జనకు,వృత్తి ఉపాధి విద్యలలో శిక్షణనివ్వడమే గాక అనేక విధాలుగా స్త్రీ జనోద్ధరణకు పాటుపడిన మిత్రులువీరేశలింగంగారికి  చాలామందిఉన్నారు.
       ఎంతటి గొప్ప వారైన ఇలాంటి ఉద్యమాలను  ఒంటరిగా చేయలేరు. ఎందరెందరో తోడుగా నిలిచారు.
వారి గురించి కొంతవరకు తెలిసికొందుము. ఈయన అర్ధాంగి తర్వాత అత్యంత అభిమాన సహకారా లను  అందించిన మరి మరి  కొందరు: 
బసవరాజు గవర్రాజు:-ఈయన వీరేశలింగం గారికి కుడి భుజం వలె సహాయం అందించారు.
పిన్న వయస్సులోనే ఈయన మరణించారు.
"బసవరాజు  గవర్రాజు మరణంతో నాలో ఉత్సాహం సగానికి సగం తగ్గిపోయింది."అని వీరేశలింగం గారు తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నారు.
అందుకే చెప్పుకోదగిన వాడుగ నిలిచాడు "బసవరాజు గవర్రాజు."
చల్లపల్లి బాపయ్య: -ఈయన కందుకూరి వీరేశలింగం గారి బాల్యమిత్రుడు. వితంతు వివాహాలకు ఉద్యమించాలని ప్రోత్సహించిందే గాక, ఇల్లిల్లు తిరిగి తగిన సమాచారాన్ని సేకరించిన, ఘనుడు.
వీరేశలింగం-కేశవ చంద్రసేన్ గ్రంథాన్ని, వీరి నుంచే తీసుకున్నాడు..
రఘుపతి వెంకటరత్నం గారు:-ఇతడు మొదటి నుండి  సంఘ సంస్కరణాభిలాషి. వీరేశలింగం పంతులు గారి వృద్ధాప్యంలో సంఘ సంస్కరణల కృషికి తోడునీడగా నిలిచారు. పంతులు గారి పట్ల
ప్రేమాభిమానాలు ఉన్న వ్యక్తి.
పైడా రామకృష్ణయ్య:-ఈయన కూడా సంఘ సంస్కరణల దీక్షా దక్షుడు. వీరేశలింగం గారికి ఆర్థికంగా దన్నుగా నిలిచిన మహానుభావుడు. విధవ పునర్వివాహాలకు ఆనాడు 30 వేల రూపాయలు విరాళం అందజేసిన వితరణశీలి.
టంగుటూరి ప్రకాశం పంతులుగారు:-కందుకూరి వారి తరువాత తరం వాడైనప్పటికి, ఆయనను గురువుగా భావించిన మహా నాయకుడు. తరువాత ఈయన 
లండన్ నగరం లో ఉన్నప్పుడు వివేకవర్ధని పత్రిక కటింగులు వీరేశలింగం గారు అక్కడికి పంపేవారు.
ఈయనకు ఆయన దన్నుగ నిలిచేవారు.
కొమర్రాజు లక్ష్మణరావు:-వీరేశలింగంగారి చేత తెలుగు కవుల  చరిత్రను సంస్కరింప జేసినది
లక్ష్మణరావుగారే. అంతేకాదు స్వీయ చరిత్ర పూర్తి చేయడానికి మూలకారకుడు. దానిని ముద్రింప చేసినవాడు ఇతడే. ఈయన ముద్రణలో పంతులుగారి అనేక గ్రంథాలు వెలిసాయి.
చిర్రావూరి యజ్ఞన్న శాస్త్రి:-ఈయన ఆనాడు రాజమండ్రిలో పేరుపొందిన లాయరు. కందుకూరి గారితో బాగా పరిచయమూన్న వ్యక్తి. ఈయన 
కందుకూరి వీరేశలింగం గారిని స్వీయ చరిత్రను
వ్రాయమని బహుధా ప్రోత్సహించిన మహా మనిషి.
ఆత్మూరి లక్ష్మీ నరసింహం:-ఈయన ఇంగ్లీష్ స్కూల్ లో వీరేశలింగం గారికి గురువు. బ్రహ్మసమాజ బోధలు చేసి సంఘ సంస్కరణల కృషికై కందుకూరి వీరేశలింగం గారిని బహువిధాల ప్రోత్సహించారు.
      కందుకూరి వీరేశలింగం గారి గురించి
      కొటికెలపూడి సీతమ్మ గారి మాటల్లో
 ఒక యెడ స్త్రీ పునర్వివాహం గూర్చి/వాదించు పండిత వరుల తోడ/సరగ నింకొక దెస సంఘసంస్కరణచే/చెలగు సభనుపన్యసించు చుండ/పరుగ వేరొక దెస పత్రికా ప్రకటన/భారంబు వహియించు ప్రజ్ఞ మీర/రహి నొక్క తరి గ్రంథ రచన విశేషంబు/నను దెల్పు జనుల దుర్నయములెల్ల/నొక నిమేషమైన విశ్రాంతి నొందకొండ/పరహితార్థంబు
కొరకునై పాటు పడుచు/ కాలమెంతయో నిలువుగా
గడుపునహహ/ ఘనుడు వీరేశలింగాఖ్య   కవి
వారుండు/
కవి ఆరుద్ర మాటలలో"అదేం చిత్రమో గాని వీరేశలిగం గారు శారీరంకంగా దుర్బలలైనా జాతిని బలిష్టం చేసి దేశాభివృద్ధిని భాషాభివృద్ధిని సాధించిన మనోబల భీములలో పంతులు గారు ప్రథములు.
రెండవ వారు గురజాడ వారు. అటువంటి ఉజ్వల చారిత్రకుని ఏ బిరుదులతో వర్ణించిన అది అసమగ్ర మే. అయినా నా నవ్యాంధ్ర నిర్మాతలనే నిర్మించిన వారిగా నేను పంతులుగారిని భావిస్తున్నాను.
అభినవ్ ఆంధ్రకు ఆయన ఆద్య బ్రహ్మ---ఆరుద్ర.
       వీరేశలింగం గారి గురించి చిలకమర్తి లక్ష్మి
నరసింహం అనే మాటలు ఇవి.
 వీరేశలింగం సమాధిపై ఈనాటికీ కనిపిస్తాయి.
  "తన దేహము తన గేహము/తన కాలము తన
ధనంబు తన విద్య/జగజ్జనులకే వినియోగించిన/
ఘనుడీ వీరేశలింగకవి జనులారా/