ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు సాహిత్యం-రాజశేఖర చరిత్రము (నవల) -- బెహరా ఉమామహేశ్వరరావు. సెల్ నెంబర్: 9290061363
September 23, 2020 • T. VEDANTA SURY • Serial

వీరేశలింగంగారి రచనా వైశిష్ట్యం రాజశేఖర చరిత్రలో అద్భుతంగా కనిపిస్తుంది. నిన్నటి భాగంలో రాజమహేంద్రవరం కడ గోదావరి నది జలములు ధవళగిరి ప్రాంతమున కందుకూరి వారు చక్కగా వర్ణించారు కదా! నదీ ప్రాంతాన గల తెల్లని పిండి రాళ్లు   కొండంత ఎత్తు కాకపోయిన పెద్ద గుట్టగా ఉండడంవల్ల, ఆ చెంతన గల కొండకు
ధవళగిరి అనే పేరు వచ్చిందేమోనని తెలియజేసా
రు.ఆ దవళగిరికి ఉత్తరాన ఒక గుహ కనిపిస్తుంది.
ఆగుహలో పాండవులు తపస్సు చేసే వారని 
పురాణ ప్రతీతని వివరించారు.
అచట గల దేవతా విగ్రహాలకు సంవత్సరం పొడవున పూజలుండవు. ఆ రోజుల్లో లో చతుష్పాదములు (జంతువులు) విహరిస్తుంటాయి. కానీ ఉత్సవ దినాల్లో మాత్రం చుట్టుపక్కల గ్రామాల నుండి  వచ్చిన జనం పూజలు చేస్తారు. అర్చకులకు  దక్షిణాలుగా డబ్బులు వేస్తారు. మంత్రాలతో పూజలు పునస్కారాలు చేసిన తరువాత తీర్థప్రసాదాలు తీసుకొని భక్తులు కదులుతారు. భక్తులు ఇచ్చిన దక్షిణలే వారికి ఆదాయము. ఇక్కడ  అర్చకులకు ఎటువంటి జీత భత్యాలు ఉండవు. భక్తులకు పులిహోర, దద్దోజనం ఇస్తారు. అవి భక్తితో స్వీకరిస్తారు.
సంవత్సరానికి ఒకసారి మాత్రమే  జనార్ధన స్వామి కళ్యాణ ఉత్సవములు, నాలుగు రోజులు జరుగుతుంటాయి. ఆ నాలుగు రోజులు చుట్టుపక్కల  గ్రామాల నుండి జనాలు  దైవ దర్శనానికి వస్తారు.ఆ రోజులలో జనంతో రద్దీగా ఉంటుంది. అర్చకులకు కాసులు కూడా భారీగానే ముడతాయి.
     తదుపరి సంవత్సరమంతా మనుషులు రారు. రాలేరు కూడా, అయితే ఈ కళ్యాణోత్సవాలలో
ధ్వజస్తంభం చిరుగంటలు గాలికి మ్రోగుతునే ఉంటాయి. జనం కోలాహలంతో ఉత్సవ సంరంభం
వేడుకగానే కనిపిస్తుంది. గ్రామాల నుండి  జనాలు అధికంగా రావడం వల్ల తోపులాటలు కుమ్ములాటలు కద్దు. జనార్ధన స్వామి కళ్యాణ దినాలలో ఉత్సవ విగ్రహాలకు వివాహ తంత్రం వైభవంగా జరుగుతుంది. మంత్రోచ్ఛారణలతో  మారు మ్రోగుతుంది.భక్తులు భక్తిశ్రద్ధలతో కనిపిస్తారు. ప్రతి నెల రెండు పక్షాల ఏకాదశులకు స్వామి దర్శనానికి వైష్ణవులు,పలువురు భక్తులు వస్తారు. తులసి పూసల దావళములు ధరించి,ద్వాదశ ఊర్ధ్వపుండ్రములు స్పుటముగ పెట్టుకొని ఏకాదశి వ్రత సంకల్ప నియమాలతో కనిపిస్తారు.
శ్రీ హరి నామ స్మరణ చేస్తూంటారు. ఏకాదశి రాత్రి
కరతాళ ధ్వనులు, మృదంగ వాయిద్యం మ్రోగిస్తూ,
నవనీత చోర నందకుమారా,/గోపాల బాల కృష్ణమ్మ/
గోపికా జాణ/రావయ్య కృష్ణయ్య రావోయి/
ఇష్టదేవతా గీతాలు ఇలా పాడుతూ!పాడుతూ!
గొంతుకలు బొంగురు పోతాయి. అప్పుడప్పుడు మధ్యలో మిరియాలు, బెల్లం నమలుతుంటారు. కృష్ణ లీలల గీతాలు పాడుతూ తలలు తిప్పుతూ ఊగి పోతుంటారు. మద్దెలలు, తాళాలు  పగిలి పోతుంటాయి.  పాటలు పాడుతూ, పాడుతూ, దేహాలూ పరవశమై వెనుక స్తంభాల మీదకు ఒరిగి పోతుంటారు. ఈ వేడుకలను చూడవచ్చు వారు, ఎంతో భక్తులనీ వారిని మెచ్చు కుంటారు. కానీ ఈ ఉత్సవాలు చూడడానికి వచ్చే విదేశీ యాత్రికులు పిచ్చి చేష్టలని పెదవి  విరుస్తారు.
మధ్యాహ్నం వేళ కొండపై నుండి నాలుగు వైపులా తిలకిస్తే చెంగు చెంగున దుముకుతూ యువతులు, ముంగాళ్ళు పైకెత్తి ఆకులు మేస్తూ మేకలు కనిపించడం, ఒడిశలు తిప్పుతూ పొలం కాపులు, పక్షుల మీదకు విసరడం. పక్షులు చెల్లా చెదురు కావడం,ఆకాశంలో ఎగురుతూ పక్షులు చెట్ల మీదకు చేరడం. అవి కంకులు తింటూ కనిపిస్తాయి.
గడ్డిపరకలు తినే పశువులు, పిల్లనగ్రోవిని మ్రోయించే
గోప బాలురు ముచ్చటగా కనిపిస్తారు.
    ధవళగిరి కొండ మీద నుండి క్రిందకు చూస్తే కనిపించే దృశ్యాలు, కందుకూరి వీరేశలింగం గారు చక్కగా వర్ణించారు. వర్ణించారు అనే కంటే చిత్రీకరించారంటే బాగుంటుంది. ఇలాంటి ప్రత్యేకతలు అనేకం ఈ నవలలో మనం చదవగలం.
(సశేషం ) 103వ భాగము)