ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు సాహిత్యం - జానపద సాహిత్యం--- బెహరా ఉమామహేశ్వరరావు-- సెల్: 9290061336
September 28, 2020 • T. VEDANTA SURY • Serial

తెలుగు సాహిత్య కావ్యరచన పదకొండవ శతాబ్దం నుండి ఆరంభమైనదని చెప్పుకుంటాం. నన్నయ ఆంధ్రీకరించిన మహాభారతము తెలుగులో  ఆదికావ్యంగా చెప్పుకుంటాం.
         నన్నయకు పూర్వమే మన  భాష, వ్యవహారిక  భాషగా జన జీవన స్రవంతిలో నిత్యమైయ్యుండేదని
సాహితీ విమర్శకులు చెబుతారు.
 ఇప్పుడు ఆంధ్రము,తెనుగు, తెలుగు అను పేర్లతో,   వ్యవహరింపబడుచున్న ఈ భాషకు కాల నిర్ణయము చేయుటకు అవకాశమే లేదు. మన తెలుగు ఏనాటిదో చెప్పలేకపోతున్నాం.
కృష్ణా, గోదావరి నదుల మధ్య గల ప్రదేశమును తెలుగు దేశం అని పేరు. ఆంధ్రుల పాలన
క్రిందకి వచ్చిన పిమ్మట ఇది ఆంధ్ర దేశం అయినది.
ఆంధ్ర దేశమునందలి తెలుగు భాషకు తదను గుణంగా ఆంధ్ర భాష అన్న పేరు ఏర్పడినది.
ఆంధ్రులు మొదటి నుండియు తెలుగుదేశం ఉన్న తెలుగు వారును కలసి ఆంధ్రులైరనియు, ఆంధ్రభాష మాత్రము అట్లు రెండు భాషల కలయికచే ఏర్పడినది కాదనియు, తెనుగే ఆంధ్రులు ఈ దేశమున ఆక్రమించుకున్న పిమ్మట ఆంధ్రమయ్యెనని, విమర్శలు అభిప్రాయపడుతున్నారు. నన్నయభట్టు కాలం నాటికే దీనికి తెనుగు ఆంధ్రము అను పేర్లుం డుననుట నిదర్శనము.
      తెలుగు భాష ద్రావిడ జన్యమా లేక సంస్కృత ప్రాకృత భాష జన్యమా అనే విషయమున భిన్న అభిప్రాయములు ఉన్నవి. తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు మున్నగు భాషలు ద్రావిడ భాషా కుటుంబమునకు చెందినవనియు ఇవి కొన్ని శతాబ్దాలుగా పూర్వమేకాకారముగా ఉండి క్రమముగా విడిపోయి ప్రత్యేకత, ప్రత్యేక పరిణామములనందినవని ఒక వాదము. ఈ వాదనకు మార్గదర్శకుడు కాల్డ్వెల్. తెలుగు సంస్కృత ప్రాకృత జన్యమని బాగా పరిశీలించినచో తెలుగు పదములు అన్నిటికీ సంస్కృతము నుండి గాని ప్రాకృతము నుండి గాని మూల రూపము గోచరించుని రెండవ పక్షం వారి వాదం. ఈ వాదమును ప్రతిపాదించిన వారు డా. చిలుకూరి నారాయణరావు గారు. ఆంధ్ర కవులును వై యాకరణలును కూడా ఈ అభిప్రాయాన్నే వెల్లడించారు. ఈ రెండు వాదాలలో  దేశమున ద్రావిడమునకే అధికమయిన ప్రచారం ఉన్నది, కానీ తెలుగు ఇతర ద్రావిడ భాషల నుండి విడివడి ప్రత్యేక పరిణామం వికాసముల నంది ఎప్పుడు మొదలిడినో నిశ్చితముగా చెప్పుటకు ఆధారములు లేవు.
        తెలుగు భాష పరిణామమునటులుంచిన
భాష వాగ్రూపముగా ఉండేననుట సత్యము.
మన భాష తీరుతెన్నులు జానపద సాహిత్యమై
ఉండేడిదా కాలము. నాటి నుండి సాగిన ఈ సాహిత్యాకి, బాల సాహిత్యముతో అనుబంధం ఉంది. అనగా బాలసాహిత్యం జననం ఏనాటిదో
చెప్పుట కష్టము.
      పుట్టిన శిశువు రోదించినప్పుడే బాలసాహిత్యము ఉద్భవించింది. అనగా శిశువు రోదించి నప్పుడు తల్లి లాలించి పాలించిన స్వరశబ్దాలే బాల సాహిత్యము నకు పునాది. మొట్టమొదటి మానవ శిశుజననమే బాలసాహిత్యానికి నాందీ పలికింది. అందుచేత బాలసాహిత్య కాల నిర్ణయము చేయలేము.(105 వ భాగము) సశేషం: