ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు సాహిత్యం - పద కవితాసాహిత్యం-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ 9290061336.
September 27, 2020 • T. VEDANTA SURY • Serial

తెలుగు సాహిత్యంలో పద కవిత్వం సాహిత్యంగా
అలరారింది. పద కవిత్వానికి దేశీ కవిత్వం అని కూడా అంటారు. సంగీతంతో కూడినది పద కవిత్వం.
ఈ కవిత్వం పాడడానికి యోగ్యమైనది. ఈ కవిత్వంలో సంగీత సాహిత్యాలకు సమాన ప్రాధాన్యత ఉంది. పదం అంటే పొందబడినది అని అర్థం. రాగం, తాళం తో పొందబడిన సంగీతాత్మకమైన ప్రక్రియ. ఈ సాహిత్య ప్రక్రియలో పదం, కృతులు, కీర్తనలు, పదములు, సమానార్ధకంగా ఉపయోగింప బడుతున్నాయి. 12వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమన మొట్టమొదట పదాలను గురించి వివరించాడు. అన్నమయ్య కీర్తనలు అలాగే త్యాగయ్య కృతులు, క్షేత్రయ్య సారంగపాణి రాసినవే పదాలుగా చెప్పుకుంటాం. మొట్టమొదట పాల్కురికి సోమన పదాలను గురించి పేర్కొంటూ, "నామ
సంకీర్తనం తస్య సర్వపాప ప్రణాశనం" అనేటట్లు
పద కవిత్వంలో ఎక్కువగా భక్తి తత్పరత కనబడుతుంది. అయినా ఈ సాహిత్యంలో
సామాజిక చైతన్యం ఉద్దేశంగా గల పద్య కవితా లక్షణం ఉంది.
ఈ పద కవితకు "తాళ్ళపాక అన్నమాచార్యులు"
ఆద్యుడు. ఇతడు 32 వేలకు పైగా రచించాడు.
అందుకే ఈయనను, "పద కవితా పితామహుడు"
అని చెప్పడం జరిగింది. తాళ్ళపాక అన్నమాచార్య కడప జిల్లా తాళ్ళపాక గ్రామంలో  1408 లో జన్మించారు. అన్నమాచార్య కీర్తన ల పై వేటూరి ప్రభాకర శాస్త్రి మొదలగువారు కీర్తన పరిష్కరించి,
కృషి సల్పారు.
అన్నమయ్య రచనలు ముఖ్యంగా శృంగార మంజరి, వేంకటేశ్వర సువ్వి సువ్వి సువ్వాలమ్మ అనే కీర్తనను కూడా అన్నమాచార్య రచించారు. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి వాగ్గేయకారుడు గా
తాళ్ళపాక అన్నమాచార్య కీర్తికెక్కాడు.
       కీర్తన రాసి, స్వరపరిచే వాడిని వాగ్గేయకారుడని అంటారు. "బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే" అని
కీర్తన రాశి సమత్వాన్ని ప్రబోధించాడు," అన్నమాచార్య.  ఈయన రాసిన పద కవిత్వం అంతా ఆధ్యాత్మిక భావనలతో నిండి ఉంటుంది. కుల మతాల ప్రస్తావన కూడా ఉంటుంది. ఈయన కవిత్వం ఏడుకొండల వెంకటేశుని స్తుతిస్తూ వ్రాసినదే.ఇది 105వ భాగం.