ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు సాహిత్యానికి అడ్డుకునే వారు లేరు. ఒకచోట కాదంటే మరోచోట విపరీతంగా వెదజల్లబడి అభివృద్ధి చెంది విస్తరింప పడుతుంది. మన తెలుగు సాహిత్యం నదీ ప్రవాహం లాంటిది. మనం ఒడ్డున నిల్చొని చూస్తుంటే అదే నీరు ఒకే విధంగా ప్రవహిస్తున్నట్లు మన మనస్సుకు అని పిస్తుంది కానీ ప్రవాహంలో నీరు, ప్రతిక్షణం మారు తునే ఉంటుంది. మన ఆలోచనకు అలా అనిపించదు. అదే విధంగా సాహిత్యం, దాని ఉనికి ప్రతిక్షణం మారుతూనే ఉంటుంది. భూ, జలరాశులు తమ శత్రువుల నుండి తమ ఉనికిని కాపాడు కుంటూ మారుతూనే ఉంటాయి. అలాగే సాహిత్యం కూడా పరిణామ దశా, దిశలు మారుతూనే ఉంటాయి. కాలానుగుణమైన మార్పులు తప్పవు. తెలుగు సాహిత్యం రాజమహేంద్రవరం, కొండవీడు, విజయనగరం , తంజావూరు, చెన్నపట్టణం విజయవాడ, భాగ్యనగరం వంటి నగరాల్లో తెలుగు సాహిత్య సౌరభం పరిమళాలు వెదజల్లుతూనే ఉంది. చాలా కాలం క్రితం అమెరికన్ పరిశోధకుడు ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. ఆయన "ఏ మోడర్ను ఇండియన్ రిఫార్మర్" అనే విషయంపై పరిశోధన చేయాలని వచ్చాడు. ఆయన తన పరిశోధన విషయ సేకరణ నిమిత్తం రాజమహేంద్రవరం, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలతో పాటుగ అనేక గ్రంథాలయాలు తిరిగాడు, కానీ అనుకున్న మేర విషయసకరణ చేయలేకపోయాడు. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి తంజావూరు గ్రంథాలయానికి వెళ్ళమని సలహా ఇచ్చాడట. ఆ ప్రకారమే ఆయన తంజావూరు గ్రంథాలయానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు తెలుగు గ్రంథాలను చూస్తే కళ్ళు తిరిగి నంత పని అయింది. తనకు కావలిసిన సమా చారము కంటే ఎంతో అదనపు సమాచారము లభించిందట. ఆయన కడు మురిసి పోయాడట! రఘునాథ నాయకుడు: ఇతని గురించి మునుపు కొంత చెప్పుకున్నాము. ఈయన నల చరిత్ర అనుద్విపద కావ్యాన్ని రచించాడు. ఈ నల చరిత్రలో ఎనిమిది ఆశ్వాసాలు ఉన్నాయి. ఇందు నల, దమయంతుల చరిత్ర పూర్తిగా చెప్పబడినది. ఇందులో గల వర్ణణ విధానం, పాత్రపోషణ చాతుర్యం రఘునాథ కవి యొక్క అసమాన ప్రతిభ కనబడుతుంది. ఈ కావ్యంలో నలదమయంతుల వన సంచారము చదివిన యెడల రచన విశేషములు తెలియగలవు. అచ్యుత రాయాబ్యుదయము పేరును బట్టి రఘునాథుని తండ్రి చరిత్రను‌ వర్ణించు కావ్యమని తెలియుచున్నది. రఘునాథుడు రుక్మిణీ పరిణయము అన్న యక్షగానమును కూడా రచించి ఉన్నాడు కాని అది అముద్రితము అని తెలియు చున్నది. రఘునాథుని ఆస్థానములందలి కవులే గాక దక్షిణాంధ్రయుగమున గల కవీంద్రులు అందరుతెలుగు సాహితీ మాతకు తలమానికములనిచెప్ప వచ్చును. వారిలో చేమకూర వేంకట కవి గొప్ప వాడు. ఇతడు రెండు ప్రబంధాలు రచించాడు. విజయవిలాస‌ము, సారంగ చరిత్రము అనునవి ముఖ్యమైనవి.ఈ రెండు ప్రబంధాలను రఘునాథ భూపాలునికే అంకితమివ్వడం జరిగింది.(సశేషం)(70వ భాగం)- బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336
July 23, 2020 • T. VEDANTA SURY • Serial