ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుసుకోండి పిల్లలూ ..--డా .కె .ఎల్ .వి.ప్రసాద్ ,-హనంకొండ ,వరంగల్ .-9866252002--8886991785.
October 9, 2020 • T. VEDANTA SURY • Poem

పిల్లల్లారా !పాపల్లారా !
బుడి..బుడి నడకల..
బుడుతల్లారా.....
రేపటి ప్రగతి కి...
గట్టి పునాదు ల్లారా!

విన్నారా ..!కన్నారా ..!
మనబంధుత్వాలూ ...
మనప్రేమ బంధాలు ...!!

అమ్మ తమ్ముడు- మామ ,
అమ్మ చెల్లెలు -పిన్ని !

నాన్న తమ్ముడు -బాబాయ్ ,
నాన్న చెల్లెలు - అత్త...!

అమ్మ అన్నయ్య -మామ,
అమ్మ అక్కయ్య -పెద్దమ్మ !

నాన్న అన్నయ్య -పెదనాన్న,
నాన్న అక్కయ్య -పెద్డత్త...!

అమ్మ కు అమ్మ- అమ్మమ్మ ,
అమ్మకు నాన్న- మీకు తాతయ్య !

నాన్నకి అమ్మ- మీకు నానమ్మ ,
నాన్నకి నాన్న -మీకు తాతయ్య !

బావ అంటే -అక్కకు భర్త ,
వదిన అంటే -అన్నకు  భార్య !

ఇలా ..ఎన్నొ..ఎన్నె న్నో...
అనుబందాలూ -ఆత్మీయతలు,

వరసా ..వావి ..తెలుసుకోండి 
బందుత్వాలు పెంచుకోండి ..!
ప్రేమ బందాలు పంచుకోండి !!
-----------------------------------------