ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తైలాభ్యంగనం -1 ఆరోగ్యం : పి . కమలాకర్ రావు
October 5, 2020 • T. VEDANTA SURY • health tips

తైలాన్ని ఒక క్రమ పద్ధతిలో శరీరానికి మర్దన చేయడాన్ని తైలాభ్యంగనం అని అంటారు . కింద పాదముల నుంచి తల వరకు తైలాభ్యంగనం  చేయడం మన శరీరానికి మంచి పుష్టి కలుగుతుంది. పూర్వ కాలం లో ప్రతి రోజు తైల మర్దన చేసుకొని మంచి ఆరోగ్యాన్ని పొంది ఎక్కువ కాలం జీవించే వారు . ఇప్పుడున్న పరుగుల జీవితం లో ప్రతి రోజు సాధ్య పడదు కనీసం వారానికి ఒక్క సారైనా తైలాభ్యంగనం  నువ్వుల నూనెతో గాని, ఆవ నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ చేసుకుంటే మంచిది . తైలాభ్యంగనం  వలన మంచి నేత్ర దృష్టి పెరుగుతుంది. చర్మము కాంతి వంతంగా తయారవుతుంది. నరాలలో రక్త ప్రసరణ పెరిగి చురుకుగా పనులు చేసుకోగలుగుతారు. శరీరంలో బలం పెరగడం వలన త్వరగా అలసి పోరు. మంచి నిద్ర వలన విశ్రాంతి కలుగుతుంది.