ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తోడు.....: --మొహమ్మద్ .అఫ్సర వలీషా -- ద్వారపూడి , (తూ .గో. జి )
November 23, 2020 • T. VEDANTA SURY • Poem

చిన్నారులు ....

మనిషి 
మేధా సంపత్తిని పెంచేందుకు....

 ఆహ్లాదపరిచేందుకు
,ఆనందపరిచేందుకు....

ఉత్తేజపరిచేందుకు
ఉల్లాస పరిచేందుకు....

ఉత్తముడిని చేసేందుకు 
జ్ఞానాన్ని పెంచేందుకు.... 

నాంది పునాది 
పుస్తకమే....

ఆ జ్ఞాన కిరణ
కాంతుల నుండి 
ఎందరో....

స్వాతంత్ర్య
యోధులు 
శాస్త్రవేత్తలు, ...

గొప్ప ఇంజనీర్లు,
డాక్టర్లు ,రచయితలు ,
కవులు ఉద్భవించారు ....

పుస్తక జ్ఞానం 
అందమైన
పురివిప్పిన 
మయూరం లాంటిది...

ప్రయాణం లో
మనకు తోడు 
ఓ మంచి పుస్తకమే.....

నిస్తేజ మైన మనసుకు
పుస్తకం ఒక 
సాంత్వన జల్లు...

మనిషి ఎప్పుడూ 
ఒంటరి వాడు కాదు ...

జీవితం లో ఒక మంచి
పుస్తకానికి మించిన
మంచి తోడు మరేదీ లేదు ....!!