ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
త్యాగనిరతి --కె ఎస్ అనంతాచార్య
September 19, 2020 • T. VEDANTA SURY • Poem

 

ఏదీ ఆశించకుండా
ఏది సొంతమని భావించక తనకు తాను అర్పించుకునే కర్పూర కళిక !

హక్కులను కాలరాచినప్పుడు
కళ్లెర్రజేసిన శౌర్యం
 పోరాటoలో నెలకొరిగిన త్యాగం
  అరాచకాలను కాలరాయ తిరుగుబాటు జండా ఎగురవేసే మడమ తిప్పని ధైర్యం
 నెత్తురు ఇచ్చి
పెంచి లోకానికి అందించిన అమ్మకన్న
మిన్న త్యాగమయి ఎవ్వరు?
నమ్మివచ్చి నీతో నడిచే అలికన్నా సుగుణ సుందరి ఎవరు?

మానవాళి మేలుకొరి
 వెన్నెముకై నిలిచిన దధీచి

కోల్పోయే సమయాలు
అవిరయ్యే ప్రాణాలు.
 లెక్కచేయని ధీర వనిత 
ఐలమ్మలు,
వీరుడు కొమురయ్య  
 ఆదర్శం ఎక్కడ?

 నీతిచంద్రికలో కనిపించే శ్లోకం కాదు
నిట్టనిలువునా చీల్చినా సత్యం వైపుకు మొగ్గు చూపే ఆత్మనిర్భరత

తిరుగుబాటు
జరుగుబాటు
విప్లవాలు, విధివంచితులకు 
 ఒకే ఒక పద బంధమై ఎదురొడ్డి పోరాడుతుంది అసువులు బాసి ఆదర్శమౌతుంది

రాగం లేని పాట లాంటిది
త్యాగం లేని జీవితం !