ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
త్రిభువన కిరణ్, తల్లిదండ్రులు పల్లవి , కిరణ్, భారతీయ విద్యా భవన్ ఎ ఆర్ ఆర్ స్కూల్ లో 7వ తరగతి చదువుతోంది . ఆమె గురుకులంలో 5 సంవత్సరాలుగా కర్నాటక గాత్ర విద్యార్థినిగా ఉన్నారు. త్రిభువన 6 సంవత్సరాల వయసులో తన అక్క పాడటం చూసి పాడటానికి ప్రయత్నించేది. సంగీతం పట్ల ఎంతో ఆసక్తిని చూపేది. ఆమెకున్న ఈ ఆసక్తిని గమనించిన ఆమె తల్లిదండ్రులు చాలా లేత వయసు నుంచే సంగీతం నేర్చుకోవాలని ఆమెను ప్రోత్సహించారు . గురుకులం వద్ద ఆమె తన తోటి విద్యార్థులతో కలిసి నేర్చుకోవడం మరియు ప్రాక్టీస్ చేయడాన్ని ఆస్వాదిస్తుంది . గురుకులం ద్వారా నిర్వహించబడే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సంగీత కచేరీల్లో పాల్గొనడం ద్వారా సంగీతం పై ఆమెకు ఆసక్తి రెట్టింపైంది. తన అభిరుచి, అంకితభావం, క్రమశిక్షణ కోసం ఆమె తన గురువు గారిని ప్రేరణగా తీసుకుంటుంది . కర్ణాటక గాత్రంతో పాటు, త్రిభువన పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకుంటోంది. ఇటీవలికాలంలో నిర్వహించిన గ్రేడ్ 5 పరీక్షలో ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్, లండన్ నుండి డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు . ఆమెకు నృత్యం పై కూడా మక్కువ కలదు. శంకరానంద కళాక్షే త్రలో గత 5 సంవత్సరాలుగా భరతనాట్యం నేర్చుకుంటోంది . పాఠశాలలో,వివిధ అంతర్ పాఠశాల & రాష్ట్రస్థాయి పోటీలలో సంగీత, నృత్య, నాటక, క్రీడలు , ఇతర సాహిత్య పోటీలలో పాల్గొని అనేక ప్రశంసలు మరియు బహుమతులు గెలుచుకున్నారు. భవిష్యత్తులో సంగీతం ,నృత్యం లో P.hd చేయాలన్నదే తన ఆశయం
June 16, 2020 • T. VEDANTA SURY • Talent