ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
థ్రెడ్ మిల్ టెస్ట్;--థ్రెడ్ మిల్ పై ఎక్సర్సైజ్ లేదా నడవడం చేస్తున్నప్పుడు ఈసీజీలో వచ్చే మార్పులను రీడింగ్ చేసే పరీక్ష ను థ్రెడ్ మిల్ టెస్ట్ అంటారు.గుండె సమస్యలు వున్న పేషెంట్ రెస్టింగ్ లోవున్నప్పుడు, మరియు శారీరకంగా అలసిపోయినప్పుడు రక్త ప్రసరణలో వచ్చే తేడాను థ్రెడ్ మిల్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.ఈసీజీ లో ఎలాంటి మార్పులు లేకుండా నిర్దిష్ట హార్ట్ రేట్ చేరుకుంటే దానిని టార్గెట్ హార్ట్ రేట్ అంటారు.దీనిని ఎలా నిర్ణయిస్తారు అంటే దానికి ఒక ఫార్ములా వుంది.టార్గెట్ హార్ట్ రేట్ =220 మైనస్ పేషెంట్ వయసు.ఈ పరీక్షకు ముందు పేషెంట్ నీళ్లు తాగడం, ఏమైనా తినడం లాంటివి చేయకూడదు.ఈ పరీక్ష చేయడానికి 30 నుంచి 60 నిమిషాలు పడుతుంది.పరీక్ష అయిపోయిన తరువాత పేషెంట్ డ్రైవ్ చేయడానికి వీలు లేదు.గుండెకు రక్త ప్రసరణ తగ్గినప్పుడు ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.దీని తరువాత కొరొనరీ ఆంజీయోగ్రామ్చేయించుకోవాలి. మిగితాది రేపు.... ప్రమోద్ ఆవంచ
August 11, 2020 • T. VEDANTA SURY • Serial