ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దగ్గు , జలుబు, కఫం - మరికొన్ని ఔషధాలు -కొందరికి దగ్గు , జలుబు,తో పాటుగా కఫం ఊపిరి తిత్తుల్లో చేరి ఇబ్బంది పెడుతుంది. అతి మధురం పొడిని నీటి లో వేసి కషాయంగా కాచి కొద్దిగా తేనే కలిపి తాగితే కఫం బయటకు వచ్చి దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. చవాన ప్రాశ లేహ్యం కూడా దగ్గు జలుబును రానివ్వడు. వామును వేయించి పొడిగా చేసి కొద్దిగా పసుపు ఉప్పు కలిపి ;పరగడుపున గోరు వెచ్చని నీటిలో వేసి తాగితే దగ్గు జలుబు తగ్గి పోతాయి మిరియాలు శొంఠి , పిప్పళ్లు సమాన భాగాలుగా తీసుకుని పొడిగా చేసి పెట్టుకుని ప్రతి రోజు ఉదయం , సాయంత్రం తేనెతో కలిపి తినాలి. దగ్గు, జలుబు, కఫం , శ్వాసకోశ వ్యాధులు తగ్గి పోతాయి. దాల్చిన చెక్కపొడి + లవంగాల పొడి శొంఠి పొడి కషాయంగా చేసి తాగినా జలుబు పోతుంది. - పి . కమలాకర్ రావు
July 24, 2020 • T. VEDANTA SURY • health tips