ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దగ్గు , జలుబు - నివారణ -- కరక్కాయ ముక్కను నోట్లో పెట్టుకుని రసం మింగుతూ ఉంటె దగ్గు తగ్గు ముఖం పడుతుంది. దగ్గు తీవ్రత ఎక్కువగా వున్నప్పుడు కరక్కాయ పొడి లో కొద్దీ పిప్పళ్ల పొడి + తేనే కలిపి నాకెయ్యాలి. దగ్గు తగ్గుతుంది. పొడి దగ్గు వస్తున్నప్పుడు నువ్వులను వేయించి పొడి చేసి మిశ్రీ కలిపి తింటే దగ్గు తగ్గుతుంది. తమలపాకు రసంలో తేనే కలిపి సేవిస్తే దగ్గు తగ్గుతుంది. తులసి ఆకుల రసంలో మిరియాల పొడి వేసి తాగితే దగ్గు, జలుబు , గొంతు బొంగురు కూడా తగ్గుతుంది. వామును పెనం పై వేయించి గుడ్డలో కట్టి వాసన పీల్చాలి . జలుబు తగ్గుతుంది. కొన్ని పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి చల్లార్చి కాషాయం తాగాలి. ధనియాల కషాయంలో మిశ్రీవేసి తాగినా జలుబు తగ్గుముఖం పడుతుంది. - పి . కమలాకర్ రావు
July 23, 2020 • T. VEDANTA SURY • health tips