ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దివ్యకాంతుల దీపావళి: --చిటికెన కిరణ్ కుమార్--సెల్.. 9490841284
November 14, 2020 • T. VEDANTA SURY • News

దీపావళి పండుగ అంటే ప్రతి ఇంటా ఆనందోత్సవాలు వెల్లివిరుస్తాయి. అందరూ చాలా ఉన్నతంగా జరుపుకునే పండుగ ఇది. ప్రతి సంవత్సరం గానే ఈ సంవత్సరం కూడా అందరికీ శుభం జరగాలని ఆశిద్దాం. గడిచిన ఎనిమిది నెలల నుండి కరోనా వైరస్ వలన వ్యాపారాలు అంతంత మాత్రంగానే జరిగాయి. కొన్ని రోజులు పూర్తిగా స్తంభించడం  కూడా జరిగింది. ఎక్కువగా వ్యాపారంలో ఉన్నతంగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ. వ్యాపారులతో పాటుగా అన్ని వర్గాల వారు కూడా పెద్ద పండుగగా భావిస్తారు.
       లక్ష్మీదేవిని ఆరాధిస్తూ  దాదాపుగా అన్ని వ్యాపార వర్గాలవారు దీపావళి నుండి ముహూర్తాలు గా కొత్త లావాదేవీలు నిర్వహించడానికి సుముఖత చూపుతారు. అంటే ఆ రోజు నుండి నూతనంగా మరింత లాభదాయకంగా వ్యాపారాలు జరగాలని ఆశిస్తారు.
        ఇక దీపావళి పండుగ రోజు టపాసులు కాల్చడం అందరికీ తెలిసిందే. లక్ష్మీ పూజల అనంతరం బాణాసంచాలు,  టపాసులతో వెలుగులు విరజిమ్ముతూ, శబ్దాలతో టపాసులు కాల్చడం ఆనవాయితీ ఇక పిల్లలలో బాణాసంచాలు లాంటివి ఎంతో ఆనందంగా ఇష్టపడుతూ కాలుస్తారు.
         భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు