ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దివ్య ఔషదం ఎక్కడో పుట్టి, అక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడినుంచో పల్లెలకు పాకుతుండె అడ్డుకుందామన్న కన్పించదాయే ఆపతరము లేక అణువణువు కలవరము రక్త సంబంధమైన రిక్త హస్తములతో సెల్ప్ ఐసోలేషన్ లో ఆమడ దూరముండి కషాయరసంతో, వేడి కాపడమందించి మందు బిళ్లలేసుకోమని మందలించె బతుకొచ్చె మందులేని రోగానికి ముందు చూపులేక తెరిచిన దర్వాజ నుంచి కరోనాను ఆహ్వానించి నేడు మనమంతా కాకవికలమౌతుంటిమి ఔషధ మంత్రమై సాగుతున్న భారతాన కరోనా పోటుకు రికవరీలు ఎక్కువే ప్రపంచమంతా వ్యాక్సిన్ సాధనలో నిమగ్నమై అందని ద్రాక్షగా నిలిచిన వేళ ఔషధమే అయువు పట్టుగా నిలుస్తుంది ఎంత చెప్పినా, ఎంత మాట్లాడిన ఒడవని ముచ్చటైంది వినేవారు లేరు ఎదురు పలుకనోళ్ళు లేరు ఆ వచ్చెనా అంటూ ఎగతాళి చేసినోళ్ళు పక్కింట్లో చేరినా పరేషాన్ కావడం లేదు సహ జీవనమంటూ సందుల్లో దూరుతూ సకలం కరోనా మయమై నిలిచిపోవట్టె రోజుకు లక్షల్లో వ్యాది సోకిన భయపడక బలాదూర్ గా తిరగడంలో మతలాబెంటి అన్నింటికీ వ్యాక్సినే మార్గసుగమమం అంతవరకు అణకువగా ఉండాల్సిందే లేదంటే కుటుంబమంతా కరోనా లెక్కలో చేరాల్సిందే కష్టమైనా నష్టమైనా ఇన్నాళ్లు ఎన్నో బాధలు పడ్డాము ఇంకొన్నాళ్ళు ఇంటి పట్టునుంటే చాలు కరోనాకు దొరకకుంటే కార్యోనుముఖులౌతాము దివ్య ఔషధ రక్షతో ఆయుష్షు పెంచుకుని భరతపుత్రులమై భవిష్యత్ బాటలెద్దాం ఉండ్రాళ్ళ రాజేశం
July 27, 2020 • T. VEDANTA SURY • Poem