ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దీపం : -కె ఎస్ అనంతాచార్య
November 11, 2020 • T. VEDANTA SURY • Poem

చీకటిని తొలగించడానికి చిన్నదైనా,పెద్దదైనా ఒకటి ఉంటే చాలు అభయాన్నిచ్చే మయూఖ మంత్రం 

వికాసం నిండుగా 
ఉండాలంటే  విశ్వాసాన్ని తైలంగా పోసి వినమ్రంగా వెలిగించే దివ్వె 


అక్షరమై తమస్సును చీల్చుకు పోయే శరం
వెలుగుగా నిలిచే వరం

సమస్యల ఊబిలో కూరుక పోయి దారి తప్పిన వారికి దీక్ష తో చూపయ్యే మకర 
జ్యోతి 

ఉద్దీపన కలిగిస్తూ ద్వేషాబావాన్ని తొలగిస్తూ భావి జీవికకు భరోసానిచ్చే  కాంతి పర్వo

వైరి వర్గులు కలిసినా మనోకూటమి బెడిసి కొడితే ఆహాన్ని  ఆహుతి చేసి
 పునీతలై నిలబడే  అగ్నితత్వం

ఐక్యతా సందేశంతో శరత్కాలంలో వెలుగులు చిమ్మే కార్తీక దీపం

మిణుకు మిణుకు మనే మిణుగురు పురుగులు భువిన వెలసిన తారకలు చైతన్యపు చారికలు

నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ
తోసుకుంటూ వచ్చినా ఎదురు తిరిగి తిరగబడి కాల్చే సే క్రాంతి పుంజం!

చాటున జరిగే పాపానికి  మౌన సాక్ష్యం ఎప్పుడూ సవాల్ కు జవాబు నిస్తూ అభాగ్యులకు అండగ నిలిచే సత్య పక్షం 

మెదడులో వెలిగే 
ఫ్లాష్ లైట్ 
స్పర్థ లో హైలెట్