ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దూషణం భూషణమే!!--కె ఎస్ అనంతాచార్య.-- పడ్డవాడెప్పుడూ చెడ్డవాడుకాడు పడినమాటలు తీర్చిదిద్దే తీనెలు మందలించే గురువు మొక్కను వృక్షంగా మలిచే ఎరువు! నాన్న వషట్కార ప్రయోగం తనను మించిన తనయుని గుణరూప ఆవిష్కారానికే! పరుషపదాలన్నీ అంతర్వానరాన్ని ఎప్పటికప్పుడు మందలించడంకోసమే! కన్నెర్ర జేస్తూ వేసే అక్షతలన్నీ కర్త వ్యోన్ముఖుడ్ని చేసే దాక్షిణ్య రూపమే ఇనుము కాలితేనే ఇంపైన ఆకారం మనసు జ్వలిస్తేనే మనిషి సాకారం దూషణం ద్వేషణం కాదు ప్రజ్ఞను ప్రకాశింపజేసే భూషణం
July 27, 2020 • T. VEDANTA SURY • Poem