ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దెయ్యాలను తరిమికొట్టిన బాలుడు :-పూసాల సత్యనారాయణ హైదరాబాద్. సెల్ నంబర్ 9000792400
September 20, 2020 • T. VEDANTA SURY • Story

మగధ సామ్రాజ్యాన్ని  వీరాజిత్ అను రాజు రాజ్యం ఏలుతు వున్నాడు. చుట్టు పక్కల రాజ్యాలను జయించిన వీరుడు. అతని పరాక్రమానికి అందరూ భయపడుతూ వుండేవారు. తమ రాజ్యము లో ప్రజలు ఏమను కుంటున్నరో తెల్సు కోవాలనే ఉబలాటం తో ఒక రోజు  బిచ్చ గాడి మారువేషంలో  తిరుగాడుతూ వుండగా ఒక గ్రామం లోని రచ్చ బండ చెట్టు కింద  పదిమంది జమ గూడి మాట్లాడుకొను చుండగా .ఒక మాట రాజు గారి చెవి లో పడింది ;  ; రాజ్యమంతా కరువు కాటకాల తో తాండ విస్తుంటే   రక్తపాతం తో రాజ్యాలను జయించు తున్నాడు. తానే  వీరుడన ని విర్రవీగతూ వున్నాడు.  ధనరాశులు వజ్ర వైడూ ర్యాలు గది లో మూలుగుతున్న  దయ్యాలకు భయపడి  బయటకు తీయలేని పిరికి వాడు మన రాజు.;;        ఇది విన్న రాజుకు ఆవేశం తో వూగి పోయాడు.  సిగ్గు తో తలవంచుకొని  తిరిగి రాజ్యానికి చేరుకొని   అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న  ఆ గదిని ఏవిధముగా నైన  రహస్యం చేధించాలని దేశమంతా చాటింపు చేయించాడు. ధైర్యమున్న వారెవరైనా ఆగదిని తెరచి ధన రాశులను బయటకు తెచ్చినవాడికి సన్మానించి వజ్ర వైడూ ర్యాలు  బహుమతి గా ఇస్తానని ప్రకటించినా డు. ఆమరునాడే  పన్నెండు సంవత్సరాల బాలుడిని  తీసుకొని వచ్చినారు వాడి తల్లిదండ్రులు.  బాలుడిని చూసి రాజు బిగ్గరగా నవ్వి హేళన చేసినాడు.ఎంతో మందిని శవాలుగా మార్చిన దయ్యాలను  పసి పిల్లాడి వైన నీవు ఏమి చేయగలవు.? వేల డంత లేవు   పిచ్చి కూతలు కూ యకు అని  అన్నాడు   ;;.బాలుడు చేయగల డు .అవకాశం ఇయ్యం డి ; అని బ్రతిమ లాడినారు.తల్లి దండ్రులు ; ఆశ్చర్యానికి గురి అయిన రాజు సరే అన్నాడు. వెంటనే ఆ గది లోనికి ప్రవేశించి గంట లోపునే  ఆ ధన రాశులను మరియు  పెట్టెలను బయటకు తీసుకొని వచ్చి రాజు ముందు పెట్టినాడు. నోరెళ్ళబెట్టి న రాజు  ఎలా సాధ్యము అయింది  . ఆగది లోనికి పోయినవారు తిరిగి రాలేదు కదా! .ఇంతకు ఆ దెయ్యాల సంగతి ఏమి అని ప్రశ్నించి నాడు. ?అప్పుడు ఆ బాలుడు  ఆ పాడు బడిన గదిలో పక్షులు గూడుకట్టుకొని అనేక రకాల వింత శబ్దాలు చేసినందుకే అవి దెయ్యలని వారి గుండెలు ఆగి పోయి వుంటాయి   అంతే కాని దెయ్యాలు కానీ భూతాలు కానీ లేవు నేను భయ పడలేదు వారు భయపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు  అంతే ఇదే రహస్యం అన్నాడు ;;.ఆ బాలుడి ధైర్యానికి మెచ్చి  వజ్ర వైడూర్య ములు ఇచ్చి  సన్మానించి  పంపించి నాడు.రాజు కరువులను లేకుండా చేసుకున్నాడు.