ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దైవ స్వరూపుడు MOURICE HILLAMAN:-దగ్గుబాటి వెంకటేశ్వరరావు
September 1, 2020 • T. VEDANTA SURY • News

దైవ స్వరూపుడు MOURICE HILLAMAN:
American microbiologist and specialist in vaccinology.. జననం30-8-1919.
. ఒకటా...రెండా.. 40 వ్యాక్సిన్ లను కనుగొన్న టువంటి వ్యక్తి . .
మనం సాధారణంగా ఉపయోగించేటటువంటి 14 వ్యాక్సిన్ లలో ఎనిమిదింటిని వీరే కనుగొన్నారు. మీజల్స, మమ్స్, రూబిల్లా, హెపటైటిస్ ఎ, హెపటైటిస్ బి, చికెన్ పాక్స్, నిమోనియా,ఇన్ప్లుయం జా,మెనింజైటిస్ లాంటివన్నీ వీరి చలవే...INFLUENZA పేండమిక్ మొదట హాంకాంగ్ లో రాగా దానిని ముందే కనుగొనడం ద్వారా ఆ పాండమిక్ ను అమెరికా తదితర దేశాల లో ఎక్కువమంది దీని బారిపడకుండా 40 మిలియన్ డోసుల వ్యాక్సినుముందు గానే తయారు చేసి లక్షలాది ప్రాణాలను కాపాడాడు. ఇతను అతి పేద కుటుంబంలో జన్మించాడు తల్లిదండ్రులకు ఎనిమిదవ సంతానం. తల్లి చనిపోవడం, తర్వాత కొద్ది రోజులకు తండ్రి చనిపోవడం వలన తన దగ్గర బంధువు అయిన రాబర్ట్ హిలమన్ వద్ద పెరిగి, వ్యవసాయ పనులు కూడా నిర్వహించి, కడు పేదరికంలో వుండి కాలేజీ కి కూడా వెళ్ళలేని పరిస్థితిలో జీవించాడు.
ఆ తరువాత చికాగో యూనివర్సిటీ లో స్కాలర్షిప్ సంపాదించి తరువాత డాక్టరేట్ చేసినటువంటి వ్యక్తి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ ఆర్మీ లో Respiratory disease department కి హెడ్ గా పని చేసి ఆ సమయంలో JAPANESE B ENCEPHALITIS Vaccine కనుగొని అనేక మందికి రక్షణ కలిగించారు
కుమార్తె JERYL LYNN కు Mums వ్యాధి సోకగా కుమార్తె నుండి వైరస్ ను తీసుకొని దాని నుండి mums కి వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. measles mumps, Rubella మూడు కలిపి ఒకేసారి పిల్లల కు నేడు ఇచ్చే MMR వ్యాక్సిన్ ను కూడా కనుగొన్నది ఇతనే. పోలియో కు అంతకు ముందు ఇంజక్షన్ రూపంలో ఉండేది వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ వల్ల infection కలుగుతుందని భావించి ORALపోలియో గా చుక్కల రూపంలో వేసే దానిని అందుబాటులోకి తీసుకొని వచ్చిన వ్యక్తి. Sv40 వైరస్ క్యాన్సర్ కి కారణమనే విషయాన్ని కనుగొన్నాడు.Hepatitis virus, తరువాత జలుబుకు కారణమైన ఏడినో వైరస్ కూడా ఇతనే కనుగొన్నాడు. ఏప్రిల్ 11- 2005 న వీరు మరణించారు.
ఈ కరోనా సమయంలో ఆయన లేకపోవడం మన దురదృష్టం అనుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో కోట్లాది మందికి ఎంతగానో ఉపయోగపడి, మానవజాతికి ఎనలేని సహాయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి . 30-8- 1919 న వారి జన్మదినం సందర్భంగా వారిని ఒక్కసారి స్మరించుకుందాం... తలుచుకొని నివాళులర్పిద్దాం...
-దగ్గుబాటి వెంకటేశ్వరరావు
2-9- 2020.. కారంచేడు