ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దొంగ మాయ---సుజాత.పి.వి.ఎల్.సైనిక్ పురి, సికిందరాబాద్ఒ--క దొంగ తాను తస్కరించిన ఆభరణాలన్నింటినీ మూటగట్టుకొని, కంగారుగా వీధివెంట పరిగెడుతుండగా ఒక ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుని ఓ పదేళ్ల పిల్లవాడు ఏడుస్తుండటం గమనించి ఎందుకు బాబు ఏడుస్తున్నావ్?'' అని ప్రశ్నించాడు. దానికా పిల్లాడు వెక్కుతూ, స్నానానికి చెరువులో దిగాను. అప్పుడు నా బంగారు మొలత్రాడు అందులో పడిపోయింది. అమ్మా నాన్నకి తెలిస్తే కొడతారని భయమేస్తోంది అన్నాడు.ఓస్ అంతేనా! ఆ చెరువెక్కడో చూపెడితే నేను నీకు ఆ బంగారు మొలత్రాడు చెరువు నించి తీసిపెడతాను అన్నాడు. సరే అని దొంగను ఆ చెరువు దగ్గరకి తీసుకెళ్లి చూపించాడు ఆ బాలకుడు. ఇదిగో ఈ మూటని జాగ్రత్త గా పట్టుకోమని చెప్పి తన మూటను ఆ పిల్లాడికి ఇచ్చి చెరువులోకి దిగాడు దొంగ.కొద్ది క్షణాల అనంతరం పైకి తలెత్తిచూస్తే ఆ పిల్లాడు, మూట రెండూ మాయం.
June 24, 2020 • T. VEDANTA SURY • Story