ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దొండ కాయ- దొండ చెట్టు - ఔషధంగా -- పి . కమలాకర్ రావు
September 1, 2020 • T. VEDANTA SURY • health tips

దొండ కాయలతో పాటు మనకు దొండ ఆకులు కూడా ఔషధంగా పనికి వస్తాయి. దొండ ఆకులు చక్కర వ్యాధికి మంచి మందు. దొండ  శుభ్రంగా కడిగి తుంచి నీటిలో వేసి కషాయంగా కాచి చల్లార్చి తాగాలి . కషాయంతో పాటుగా ఉడికించిన ఆకులను కూడా  తినాలి. చక్కెర వ్యాధి తగ్గి పోతుంది. కొన్ని పండిన దొండ పళ్ళు తెచ్చి కడిగి ముక్కలుగా కోసి అంధులో జిలకర +ఉప్పు వేసి కషాయంగా కాచి చల్లార్చి తాగితే , అలర్జీతో వచ్చిన దద్దుర్లు తగ్గి పోతాయి.  నోటిలో పుళ్ళు తగ్గడానికి పచ్చి దొండకాయను నమిలి తినేయాలి. నోటిలో పుళ్ళు తగ్గి పోతాయి. ఇది కాలేయ వ్యాధులను తగ్గిస్తుంది. దీని తెల్లని పువ్వులను కొబ్బరి నూనెలో వేసి తైలంగా కాచి చర్మ వ్యాధులపై తగ్గడానికి చర్మంపై రాచుకోవాలి. కుష్ఠు వ్యాధి కూడా తగ్గుతుంది..