ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నటనలో మేరు నగధీరుడు అక్కినేని : మాడిశెట్టి గోపాల్, కరీంనగర్
September 20, 2020 • T. VEDANTA SURY • News

న‌డిచే న‌ట భాండాగారం.. న‌వ‌ర‌స న‌ట‌భూష‌ణుడు.. న‌ట‌సామ్రాట్.. ఈ త‌రం న‌టులకు ఓ గ్రంధాలయం . తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఆయ‌నది ఒక విశిష్ట అధ్యాయం. ఆయ‌నే ది గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు. నేడు ఈ మ‌హాన‌టుడి జ‌యంతి* స్మరించుకుందాం..
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు  ఈ పేరు తెలియని తెలుగువాళ్లు ఉండరు. తెలుగు సినిమా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన నటుడు అక్కినేని. సెప్టెంబర్ 20న అక్కినేని జయంతి. నాటక రంగం నుండి సినిమాల వైపు వచ్చిన ఏఎన్నార్ తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బలరామయ్య విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేని చూసారు . ఆ తరువాత సినిమాలకు పరిచయం  చేసారు. ధర్మపత్ని సినిమాతో అక్కినేని  సినీజీవితానికి తెరలేచింది. తెలుగు, తమి‌ళ సినిమాలలో 80 సంవత్సరాల పైగా నటించారు. తెలుగు సినీపరిశ్రమకు ఎన్టీఆర్ తోపాటు మరో మూలస్థంభంగా నిలిచారు ఎన్నార్. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటసామ్రాట్
అక్కినేని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబర్ 20 న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించాడు. చిన్ననాడే నాటకరంగం వైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించాడు. అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. వారికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు -అక్కినేని వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగ సుశీల, సరోజా. భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశాడు. అన్నపూర్ణ 28.12.2011 న మరణించింది. 'అక్కినేని' విలక్షణతకు, క్రమశిక్షణకు ఆదర్శ ప్రాయుడు. క్రమశిక్షణతో కెరీర్‌ ప్లాన్‌ చేసుకొంటే ఎలా ఎదగవచ్చుఅనే దానికి 'అక్కినేని' జీవితమే గొప్ప ఉదాహరణ. త‌నలోని లోపాలేంటో అక్కినేనికి బాగా తెలుసు. అక్కినేని ఉన్నత కుటుంబంలో పుట్టలేదు.. గొప్ప చ‌దువులు చ‌ద‌వ‌లేదు. ఆయ‌న‌ది అంద‌మైన రూపం కాదు.. ఆక‌ట్టుకునే స్వరం లేదు.. కానీ ఇవేవీ అక్కినేని ఎదుగుద‌ల‌కు అడ్డుకాలేదు. త‌న లోపాల్ని అధిగ‌మించి భారతీయ సినీచ‌రిత్రలోనే మేటిన‌టుడిగా ఎదిగారు అక్కినేని .

అక్కినేని నాగేశ్వరావు నటించన తొలిచిత్రం 'ధర్మపత్ని' అయినప్పటికీ నటుడిగా జన్మించినది 'సీతారామజననం' చిత్రంతో. ఆ చిత్రంలో అవతార శ్రీరాముడిగా నటించిన అక్కినేని  'శ్రీరామరాజ్యం' చిత్రంలో వాల్మీకి పాత్రను పోషించడం ఒక విశేషం. తెలుగు సినిమాతో పాటే తన పేరు ప్రఖ్యాతులను పెంచుకూంటూ వచ్చి చివరకు తెలుగు సినీరంగానికే వాల్మీకి అయ్యారు. తమిళంలో కూడా అక్కినేని నాగేశ్వరావు నటించిన మూడు చిత్రాలు 175 రోజులు ప్రదర్శించబడినవి. అవి దేవదాసు, ఎంగల్‌ వీట్టు మగాలక్ష్మీ, కళ్యాణ పరిసు
అక్కినేని నాగేశ్వరావు నటించన, ప్రతిభా వారి 'బాలరాజు' చిత్రం విజయవాడలో 1948 ఫిబ్రవరి 26న రిలీజై రోజుకు మూడు ఆటలతో 428 రోజులు ప్రదర్శించబడింది. ఈ చిత్రంలా ఆనాడు ఏ చిత్రం ప్రదర్శించబడలేదు. పైగా ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్స్‌ ఆనాడు ఏ చిత్రం వసూలు చేయలేదు.

నాగేశ్వరారావు నటించిన 43వ చిత్రం 'రోజులు మారాయి'. 14-4-1955న రిలీజైన ఈ చిత్రం 17 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. అక్కినేని నాగేశ్వరావు నటించన 'ముగ్గురు మరాఠీలు' చిత్రంతో ఈ వేడుకులు జరుపుకోవటం మొదలయింది.

'తొమ్మిది' పాత్రలు ధరించిన ఏకైక నటుడు...
తెలుగు చలనచిత్ర రంగంలో అక్కినేని నాగేశ్వరావు మొదటిసారిగా ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ సమర్పణలో విజయచాముండేశ్వరి పిక్చర్స్‌ (సావిత్రి స్వంత సంస్థ) వారి 'నవరాత్రి' చిత్రంలో తొమ్మిది పాత్రలను పొషించి మెప్పించారు.. 'నవరాత్రి' చిత్రం 22-4-1966న రిలీజైంది.

తెలుగులో మొదట ద్విపాత్రాభినయం...
అన్నపూర్ణ పిక్చర్‌్ావారు నిర్మించిన 'ఇద్దరు మిత్రులు' చిత్రంలో మొదటిసారిగా ద్విపాత్రాభినయం గల పాత్రలు ధరించారు. ఈ చిత్రం 29-12-1961న రిలీజై రజతోత్సవం (175 రోజులు) జరుపుకొన్నది.

గోల్డెన్‌ డిస్క్‌ పొందిన అక్కినేని నటించిన చిత్రాలు...
మేఘసందేశం :- సినిమా విడుదల కాకుండానే 30 వేల గ్రామ పోన్‌ రికార్డులుగాని క్యాసెట్లు గానీ అమ్ముడు పోవడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ రికార్డు కేవలం అక్కినేని నాగేశ్వరావు నటించిన 200వ చిత్రం 'మేఘసందేశం'కు దక్కింది. లక్ష యూనిట్లు రికార్డుల అమ్మకం 22-9-1982 నాటికి పూర్తి అవగా, యస్‌.ఇ.ఎ.కంపినీ వారు మద్రాసు సవేరా హోటలలో ఒక సభ జరిపి, తమ డీలర్లును (రికార్డులను, క్యాసెట్లును అమ్మినవారిని) ఘనంగా సన్మానించి అభినందించినారు. అసలు చిత్రం విడుదల కాకముందే 'గోల్డన్‌ డిస్క్‌' సాధించిన ప్రప్రథమ తెలుగు మరియు దక్షిణ భారత చలన చిత్రం ఒక్క అక్కినేని నాగేశ్వరావు నటించిన 'మేఘసందేశం' మాత్రమే. 
ఆయన అందుకున్న పురస్కారాలు, సత్కారాలు.. 
• విశిష్ట వ్యక్తి అవార్డు – 10.03.1988 – సాహితి సాంస్కృతిక సంస్థ, తెనాలి.
• రాజ్ కపూర్ స్మారక అవార్డు – 10.06.1989 – కిన్నెర ఆర్ట్ థియేటర్స్, హైదరాబాదు.
• రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు – 10.03.1980 – ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
• పద్మవిభూషణ్(భారత ప్రభుత్వం)
• పద్మ భూషణ్ – 1988 – భారత ప్రభుత్వం.
• కాళిదాస్ సమ్మాన్ – మధ్య ప్రదేశ్.
• దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు – 07.04.1991 – ఆర్. వెంకట్రామన్, భారత రాష్ట్రపతి, కొత్త ఢిల్లీ.
• లైఫ్ టెమ్ అఛీవ్ మెంట్ అవార్డు - 21.10.1994 - కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్, పిట్స్ బర్గ్.
• అన్నా అవార్డు – 24.11.1995 – జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, చెన్నై.
• పద్మశ్రీ – 1968 భారత ప్రభుత్వం.
• యన్టీయార్ జాతీయ పురస్కారము (ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం).
• డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డ్, దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసు.
• నటసామ్రాట్.[4]
• కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్)

ఆయన గురించి సంక్షిప్తంగా ...

నటించిన మొదటి చిత్రం: శ్రీ సీతారామ జననం
విడుదలైన మొదటి చిత్రం: ధర్మపత్ని (10-1-1941)
100వ చిత్రం: గుండమ్మకథ
200వ చిత్రం: మేఘసందేశం
హిందీలో నంటించిన ఒకే ఒక చిత్రం: సువర్ణ సుందరి
తెలుగులో నటించిన చిత్రాలు: 254
తమిళంలో నటించిన చిత్రాలు: 11
అన్ని భాషలలో నటించన చిత్రాలు: 266
వివాహము జరిగినది: 18-2-1949
అన్నపూర్ణ స్టూడియోకు శంకు స్థాపన చేసినది: 13-8-1975
స్టూడియో ప్రారంభించింది: 14-1-1976
స్టూడియోలో షూటింగ్‌ జరుపుకున్న మొదటి సినిమా: సురేష్‌ మూవీస్‌ వారి సెక్రటరీ

కళాప్రపూర్ణ. గౌరవ డాక్టరేట్ అందుకున్న అక్కినేని 1968 లో పద్మశ్రీ అవార్డు, 1988 లో పద్మభూషణ్, 1989 లో రఘుపతి వెంకయ్య, 1990 లో దాదా సాహెబ్ ఫాల్కే, 1996 లో ఎన్టీయార్ జాతీయ అవార్డులూ అందుకున్నాడు. 2011 లో పద్మవిభూషణ్ అందుకున్న ఏకైక వ్యక్తి, నటుడు. భారతీయ సినీ రంగంలో అక్కినేని చేసిన అత్యుత్తమ సేవలకు గాను గౌరవ పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు.

మనిషిగా, సంఘజీవిగా కూడా అక్కినేని తనవంతు కృషి చేశాడు. గుడివాడలోని కళాశాలకు భూరి విరాళమిచ్చినందుకు ఆ కళాశాలకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏఎన్ఆర్ కళాశాల (ANR College) అని నామకరణం చేశాడు. తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, విరాళాలు ఏర్పాటు చేశాడు.విరాళాల రూపంలోనే కాకుండా ఒక గొప్ప సమాజ నిర్మాణానికి తోడ్పడడానికి "సుడిగుండాలు", "మరో ప్రపంచం" వంటి సందేశాత్మక చిత్రాలను శ్రీఆదుర్తి సుబ్బారావుతో "చక్రవర్తి చిత్ర" పతాకంపై నిర్మించాడు.

త‌న‌కు క్యాన్స‌ర్ ఉంది అని ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ చెప్పిన ధైర్యశీలి అక్కినేని నాగేశ్వర‌రావ్ మాత్రమే. బ‌హుశా త‌న రోగాన్ని ప్రపంచానికి చెప్పి.. తాను మ‌ర‌ణించ‌బోతున్నాన‌ని ఒప్పుకున్న న‌టుడు ప్రపంచంలో అక్కినేని మిన‌హా ఎవ‌రూ లేరేమో. న‌టుడుగానే కాదు.. ప‌ద్దతిగ‌ల నిర్మాత‌, భాద్యత గ‌ల తండ్రి, మార్గద‌ర్శి.. ఇలా ఎన్నో పాత్రల్లో స‌మ‌ర్థవంతంగా జీవించిన మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావ్సినీ పరిశ్రమకి ఓ లెజెండ్. ఇలాంటి లెజెండ్  91 సంవత్సరాల వయసులో 2014, జనవరి 22 న మరణించాడు.ఆయనకు నివాళులు