ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నది ఒక పాఠం--కె ఎస్ అనంతాచార్య-- సమీపిస్తే చాలు సాంతం మనదనే భావన మది నిం డి పోతుంది! మునిగిన వారికి స్వచ్చతనిచ్చి తాను మైల స్వీకరిస్తుంది! ప్రవహించడాన్ని గమనిస్తే చాలు ఎన్ని అద్దంకులేదురైనా ముందుకే కదలడం నేర్పిస్తుంది కలువలు,తామెరల తో నిత్యం సూర్య చంద్రో పాసన చేస్తుంది! చేపలు,మొసళ్ళు పాములు,ప్లవకాలు సకల జల చరాలకు ఆయువు పట్టు పంట పొలాల్లో జీవదాత్రి విద్యుత్ వెలుగయ్యే సవిత్రి! గలగలలు ,పరుగులు తరగలు, నురగలు అడుగడగున నాద వినోదం మైదానాలు, కొండలు కోనలు, గుట్టలో సుళ్ళుతిరుగుతూ ప్రణమిల్లుతూ సాగే జీవ వాహిని నది ఎండి పోతూ మేఘంలో కలసి వర్ష కావ్యాలు రాసి పునీతమౌతుంది
August 12, 2020 • T. VEDANTA SURY • Poem