ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నమస్కారం.బేతాళకథ.33.-- డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు -- పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని బంధించి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు.శవంలోని బేతాళుడు'మహిపతి నీపట్టుదల చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.నువ్వు చాలా భక్తి పరుడవు.అంభాభవాని,అసులా దేవి,ఏకవీరికా దేవి,కామరూపిణి దేవి,కామాక్షి దేవి,కర్ణాదేవి,కాళికా దేవి,కాళీ దేవి,కిరీటా దేవి.కేదారనాధ దేవి,గౌరి దేవి, చాముండి దేవి,జ్వాలా దేవి,జ్వాలముఖా దేవి,జోగులాంబా దేవి,తారా దేవి,త్రిపురేశ్వరి దేవి,తులజాభవాని దేవి,శ్రీదేవి,నందినీ దేవి,నయనా దేవి,నాసికా దేవి,పరశు దేవి,పాతాళేశ్వరి దేవి,పురుహోతికా దేవి,పుల్లరా దేవి,బహుళా దేవి, బిందువాసినిదేవి, భవాని దేవి,భీమా దేవి,భ్రమరాంబ దేవి,మహాలక్ష్మి దేవి,మహాకాళి దేవి, మహిషాసురమర్ధని దేవి,మాణిక్యాంబ దేవి,మాతా దేవి,మాధవేశ్వరి దేవి, మీనాక్షి దేవి,మంగళగౌరి దేవి,యోగాడ్యా దేవి,వింధ్యవాసి దేవి,విమలా దేవి,విరజా దేవి,విశాలాక్షి దేవి.వైష్ణవి దేవి,శాంకరి దేవి,శారదా దేవి,శౌరికా దేవి,శ్రీకాంకాళి దేవి,శృంఖలా దేవి హరిశుధ్ధ దేవి,హింగుళా దేవి పీఠాలను సందర్శించి పూజించిన నీవు చాలా కాలంగా నేను తెసులు కోవాలి అనుకుంటున్న నా సందేహం తీర్చాలి.నమస్కారం యొక్క విశిష్టత విశదంగా తెలియజేయి'అన్నాడు బేతాళుడు.'బేతాళా సరస్వతి నమస్తుభ్యం అంటూ అక్షరాభ్యాసం చేసే ముందు ఆ సరస్వతి దేవికి విజ్ఞాన దీపం వెలిగించమంటూ మొదటి సారిగా నమస్కరిస్తాం.తరువాత మాతృదేవోభవ,పితృదేవోభవ,ఆచార్యదేవోభవ అంటూ జీవన ప్రదాతలైన తల్లితండ్రులకూ,విద్యాదాతయైన,జ్ఞాన ప్రదానం చేసే గురువుకు నమస్కరిస్తాం.వందే శంభు ముమాపతిం,కృష్ణా వందే జగద్గురుం అంటూ దేవుని ప్రార్ధిస్తాము.జీవితంలో అలా ప్రారంభమైన నమస్కారం మన సంస్కృతి సంప్రదాయాలకు ఓ సంస్కారంమౌతుంది.మనస్ అనే శబ్దమే నమస్ గా శబ్ద రూపాంతరం చెందిదని పెద్దలు అంటారు.'ఆరాధ యితుః ఆరాధ నీ యస్య ఉత్త్కర్షాను సంధాన పూర్వక ప్రహ్వాభావో నమస్కారం.నమస్కారం ఎవరికి చేయాలి? ఎవరుచేయాలి? ఎప్పుడు చేయాలి?ఎలా చెయాలి? అనే ప్రశ్నలకు మన పూర్వికులు సమాధానాలు సిధ్ధంచేసారు.మాతాపితా గురుర్విద్వాంసశ్చ-ప్రత్యహం అభివాదనీయంఃబ్రహ్మచారి ప్రతిదినం తల్లికి,తండ్రికి,ఆచార్యునికి,విద్వాంసునికి నమస్కరించి నట్లయితే ఆయురార్ధము,జ్ణానము,ఆరోగ్యము,శుభములు చేకూరతాయని వైఖానాస ధర్మ సూత్రం చెబుతుంది.నమస్సు అంటే వినయమని,భక్తితో కూడిన ప్రణామమని అర్ధం! మనం చెప్పేనమస్కారం అనే పదానికి జోలి,జోహారు,మ్రొక్కు,చేమోడ్పు,జేజే, ప్రణిత,ప్రణామము,వందనం,మప్పిదాలు,దీవెనకోల వంటి అనే పర్యాయ పదాలు వాడబడు తున్నాయి.శివ పంచాక్షరి,నారాయణ అష్టాక్షరి మహామంత్రాలు నమః శబ్దంతోనే మొదలవుతాయి. నమస్కారం పంచప్రణవాలలో ఒకటిగా విజ్ఞులు పేర్కొన్నారు.ఓంకారం,స్వాహాకారం,స్వాద్వికారం,వషట్ కారం, నమస్కారం,అంటూ పంచ ఆకారాలకు అర్ధవంతమైన సాకారం కలిగించారు.ఏ నియమం లేని సంస్కారం నమస్కారం ఒక్కటే.మన సంప్రదాయంలో పంచాంగ నమస్కారం. అష్టాంగ నమస్కారం. అనే రెండు రకాల పద్ధతులు ఉన్నాయి.పంచాంగ నమస్కారము అంటే శిరస్సు, రెండుభుజాలు,రెండు కాళ్ళు నేలకు ఆనించి చేసే నమస్కారం. అష్టాంగ నమస్కారం అంటే సాష్టాంగ దండ ప్రణామంగా వ్యక్తీకరించబడింది. దండం అంటే కర్ర అని అర్ధం.అంటే మనిషి కర్రవలె సాగిలపడి నమస్కరించడం. స+అష్ఠ +అంగ +ప్రణామం= సాష్టాంగ ప్రమాణం.మన శరీరంలోని ఎనిమిది భాగాలు హ్రుదయం చూపు,శిరస్సు, నోరు, ముక్కు, చేతులు,పాదాలు ,చెవులు,నేలను తాకేలా దైవం ఎదుట బోర్లపడి నమస్కరించడం సాష్టాంగ ప్రమాణం.పోర్లు దండాలు,అంగ ప్రదక్షణలు వంటి ఎన్నో నమస్కారాలు మనవాళ్ళు ఆచరిస్తుంటారు.పెద్దలైన వారు నమస్కారం స్వీకరిస్తూ...ఆనమస్కారం తమకు కాదని 'పరమేశ్వరార్పణం'అంటూనో 'కృష్ణార్పణం'అనో 'శుభంభుయత్'లేక 'సమస్తసన్మంగళానిభవంతు' అనో లేక'దీర్ఘాయుష్మాన్ భవ'-చిరంజీవ సుఖీఃభవ,అనో దీవిస్తారు. అంజలి పరమాముద్ర దేవాక్షప్రప్రసాదిని! దేవతలు వెంటన అనుగ్రహించేలా నమస్కరించే విధానాన్ని అంజలి ముద్ర అంటారు.హ్రుదయానికి దగ్గరగా రెండు చేతులు జోడిస్తూ నమస్కరిస్తే దాన్ని హ్రుదయ పూర్వక నమస్కారం అని హృదయాంజలిముద్ర అంటారు.దేవుని ముందు వినయంగా అహంకారం లేకుండా రెండు చేతులు ఒక్కచోట చేర్చుతూ పూర్తిగా మూసివేయకుండా ఆదేవుని దీవెనో, పుష్పమో,ఫలమో పడేలా కాస్తంత తెరిచి ఉంచిన ఆస్ధితిని 'అంజలి బంధం'అంటారు.మన అంజలిని స్వీకరించిన దేవుడు (దేవత)తన అనుగ్రహాన్ని(ప్రసాదాన్ని)ఈ అంజలిలో వేస్తారు.నమస్కారం ఎంత విలువైనదో మహాభారతం ఇలా చెపుతుంది. ఏకోపికృష్ణస్యకృతః ప్రణామో – దశాశ్వమేధవభృధేనతుల్యఃపది అశ్వమేధ యాగాలు చేసిన అవభృధ స్నానాలతో ఒక్క నమస్కారం సమానమంటే నమస్కారం ఎంత గొప్పదో,ఎంత విలువైనదో అర్థం చేసుకోవచ్చు. అర్హులైన వారి పాదాలు తాకి నమస్కరించమని మనపురాణాలు చెపుతున్నాయి.నమస్కార విధానం మనహృదయ సౌశీల్యత, సంస్కృతి సంప్రదాయలను మన నడవడికను తెలియజేస్తుంది'అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా మాయమై చెట్టు పైకి చేరాడు బేతాళుడు.పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.
July 23, 2020 • T. VEDANTA SURY • Story