ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నమ్మకమూ నడవడీ--ఆర్థర్ ఆష్ ఓ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. గ్రాండ్ స్లామ్ లో యు.ఎస్. ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ గెలిచిన తొలి నల్లజాతీయుడు (అమెరికా). 1983లో గుండెకు శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ఆర్థర్ ఆష్ కి రక్తమవసరమై ఎక్కించినప్పుడు ఎయిడ్స్ సోకింది ఈ విషయం తెలియడంతోనే కలవరపడుతూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆయనకు ఉత్తరాలు రాశారు. మీలాంటి గొప్ప వ్యక్తికి ఎయిడ్స్ లాంటి దారుణమైన జబ్బు రావడమేంటీ? ఆ దేవుడు మిమ్మల్నెందుకట్లా ఎయిడ్స్ బారిన పడేశాడు?" అని ఆందోళనను వ్యక్తం చేశారు. అప్పుడు ఆర్థర్ ఆష్ ఇచ్చిన జవాబు..."ప్రపంచ వ్యాప్తంగా యాబై మిలియన్ మంది టెన్నిస్ ఆడటం మొదలుపెట్టారు. అయిదు మిలియన్ మంది టెన్నిస్ ఆడటం ఎలాగో నేర్చుకుంటారు. అయిదు లక్షల మంది ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడుతారు. యిభై వేల మంది సర్క్యుట్ టెన్నిస్ ఆడుతారు. అయిదు వేల మంది గ్రాండ్ స్లామ్ స్థాయికి చేరుకుంటారు. యాభై మంది వింబుల్డన్ చేరుకుంటారు. నలుగురు సెమీఫైనల్స్ కి చేరుకుంటారు. ఇద్దరు పహఫైనల్స్ లో ఆడుతారు. నేను వింబుల్డన్ ట్రోఫీ గెల్చి కప్ అందుకున్నప్పుడు నేనడిగేనా దేవుడ్ని...ఈ వింబుల్డన్ కప్ నాకే ఎందుకిచ్చావని? అప్పుడు అడగని నేను ఈరోజు ఈ జబ్బుబారిన పడినప్పుడు నన్నే ఎందుకు గురి చేసావని ఆ దేవుడిని అడగవచ్చా? ఆనందంగా ఉండటం హాయిగా ఉంచుతుంది. శక్తినిస్తుంది. కష్టాలూ కన్నీళ్ళూ మనిషిని చేస్తాయి. వైఫల్యాలు అణకువనిస్తాయి. విజయపరంపర ఉత్సాహానిస్తుంది. కానీ నమ్మకమూ నడవడీ మనల్ని ముందుకు నడిపిస్తాయి"!!- జ.యా.
August 9, 2020 • T. VEDANTA SURY • News