ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నలపాకము:- డాక్టర్ . బి. వి. ఎన్ . స్వామి
October 11, 2020 • T. VEDANTA SURY • Story

‘‘అక్షరం ముక్క రానోడు ఫస్ట్‌క్లాసులో పాస్ అవుతున్నడెం దుకు’’ బుంగి ప్రశ్నించిండు.
‘‘అదంతా ఒక పెద్ద వ్యవహారం’’
‘‘ఏంటది’’
విద్యార్థుల ఉత్తీర్ణతకు, ఉపాధ్యాయుల బోధనకు ముడిపెట్టినారు. వారు చదవక పోవడానికి వీరు జవాబుదారీతనం వహించాల్సి వస్తుంది. ఆ బాధ వర్ణనాతీతం. సంవత్సరకాలంలో అనేక విధాలుగా ప్రయత్నించినా రాయని వాళ్ళు అనేకులు ఉంటున్నరు. వాళ్ళు రాయకపోతేనేం, నేను రాయించి జిరాక్స్ తీయించి పదిమందికి సమాధానాల్ని అందించాలని ఒక ప్రయత్నం చేసిన. చేతిరాత బాగున్న ఒకబ్బాయికి  రెండు ముఖ్యమైన సమాధానాల్ని కాగితానికి ఇరువైపులా రాయమని చెప్పిన. పుస్తకం చూసుకుంటూ రాసి తీసుకొచ్చిండు. నాకు సంతోషమనిపించింది.
అతని దస్తూరి చాలా అందంగా అర్థమయ్యే విధంగా ఉన్నది. సమాధానాల్ని చదివిన. అక్షరం తపలేకుండా రాసిండు. జవాబు చివరన రిటెన్ బై అనిల్ అని రాసుకున్నడు. అది గమనించి నవ్వొచ్చింది. పదిమందికి ఆ కాగితాలు పంచుతమనే విషయం తెలిసాక, అవి తనే రాసాననీ తనపేరు పదిమందికి తెలియాలనే తపన అతనికి బలంగా ఉందని అర్థమయింది. ఇక మనిషిలో త్యాగభావనకు తావెక్కడ! వ్యక్తి శ్రేయోకాంక్ష చిన్నపడే నలపాకమై జీర్ణం కావడం దేని ప్రభావమో అర్థం కాలేదు.
‘‘అర్థం కాకపోవడం నీ బలహీనత. నీ కన్నా చిన్న వాడైన వాడికి అన్నీ తెలియడం బలం’’ అన్నాడు బుంగి.
‘‘వాడికేం తెలుసు’’
‘‘తన పేరును ఎలా ప్రచారం చేసుకోవాలో తెలుసు నిక్కచ్చిగా చెప్పాలంటే అది కీర్తి కాంక్ష’’
‘‘అది స్వార్థం అనిపించుకోదా’’
‘‘అది పెరిగింది కనుకనే ఎక్కువ ఉత్తీర్ణత శాతం కనపడుతుంది.’’
బుంగి విశ్లేషణకు ఆశ్చర్యపోవడం నా వంతైంది.
చదువది ఎంత గల్గిన రసజ్ఞత యించుకయైనలేని యా
చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చరెచ్చటన్
పదనుగ మంచి కూర నలపాకము వండిన గాని యందునిం
పొదవెడి నుపలేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా
భాస్కర శతకం
మారద వెంకయ్య