ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నల్లేరు - ఔషధ గుణాలు - 1- పి . కమలాకర్ రావు
September 8, 2020 • T. VEDANTA SURY • health tips

నల్లేరు ఒక మందమైన తీగ జాతి మొక్క . ఇది విపరీతమైన దురదను కలిగి ఉంటుంది . ఎముకలకు మంచి శక్తిని కలుగ చేస్తుంది. గుండెకు మంచి రక్త ప్రసరణను తోడ్పడుతుంది . నల్లెరును ఒక స్టెరాయిడ్ అని అంటారు. రక్త స్రావం కాకుండా ఆపుతుంది. కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. నల్లేరును నార తీసి ముక్కలుగా కోసి సున్నపు నీటిలో వేసినా , లేక చింత పండు రసంలో వేసినా దురదలు తగ్గుతాయి. కోసి ఉంచిన ముక్కలను నేతిలో లేక నువ్వుల నూనెలో వేయించి చింత పండు వేసి మిక్సీ చేసి పచ్చడిగా తయారు చేసి తింటే గుల్ల బారిన ఎముకలు గట్టి పడుతాయి. ఇది ఆస్టియో పోరోసిస్ కు మంచి మందు. దీనిని పులుసు కూరగా తిన వచ్చు. .