ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నల్ల ఆవాలు -ఔషధగుణాలు,: పి . కమలాకర్ రావు
November 20, 2020 • T. VEDANTA SURY • health tips

 ఎర్ర ఆవాల కన్నా    నల్ల ఆవాలు మరింత ఘాటు వాసన కలిగి ఉంటాయి. ఔషధ తత్వం కూడా ఎక్కవగా ఉంటుంది.గొంతు నొప్పి, గర గర వాపు  వున్నట్లైతే  నల్ల ఆవనూనె పైన పూసుకుంటే  నొప్పి వాపు తగ్గిపోతుంది. బట్టతలపై జుట్టు మొలవాలంటే కొన్ని నల్లఆవాలను  వేయించి పొడిగా చేసి పచ్చి ఆవాలను మెత్తగా నూరి, ఆవనూనెలో కలిపి తలకు పట్టిస్తే బట్టతలపై జుట్టు వస్తుంది.కఫం ఎక్కువయి నంజు బయటికి రానప్పుడు  పడుకునేటప్పుడు  పాదాలపై ఆవనూనె రాచుకుంటే  ఉదయానికల్లా  అంతా కఫంతగ్గి తేలికవుతుంది. ముక్కు పై ఆవనూనె రాస్తే ముక్కు నుండి నీరు కారడం తగ్గుతుంది. చిన్న పిల్లలకు ఛాతి పై నల్ల ఆవనూనె రాస్తే జలుబు, దగ్గు తగ్గి పోతుంది. మోకాళ్ళ నొప్పులు ఎక్కవైనప్పుడు  నల్ల ఆవనూనెలో కర్పూరం కలిపి గుడ్డలో తడిపి పట్టీ వేసుకుంటే నొప్పులు పూర్తిగా తగ్గి పోతాయి. వాపులు కూడా తగ్గి పోతాయి. నల్ల ఆవాలను పత్తి ఆకులతో కలిపి నూరి న ముద్ద తేలు కాటు విషాన్ని బయటకు లాగేస్తుంది.కొందరికి చంకల్లో గడ్డలు వచ్చి బాధ పెడతాయి. నల్ల ఆవాలపొడి లో నీరు కలిపి  ముద్దగాచేసి గడ్డలపై కడితే. కొద్దీ రోజులలో గడ్డలు కరిగి పోతాయి. శరీరంలో ఎక్కడైనా రక్తం గడ్డ కడితే  నల్ల ఆవాల నూనె రాసి కాపడం పెడితే మామూలు స్థితికి వస్తుంది.