ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నానీలు (సెప్టెంబర్ 4న పేపర్ బాయ్స్ డే సందర్భంగా):-నానీల కవి:- లిఖిత్ కుమార్ గోదా, ఫోన్:- 9949618101
September 4, 2020 • T. VEDANTA SURY • Poem

నల్లని నిశీధిలో
తెల్లని కపోతమై
వార్తల మూటను
వాకిట్లోకి మోసుకొస్తాడతడు.

******

అంగడి నుండి
అంతరిక్షం వరకు
సమాచారం పంచుతాడు
ప్రజల చేతుల్లోకి.

* * * *

ప్రజా చైతన్యమే లక్ష్యంగా
వీధి వీధి తిరుగుతూ
శుభాలు- అశుభాలు
మోసుకొచ్చే సమాజమిత్రుడు.

* * * *
పేదరికానికి ఎదురుగా
జీతం చిన్నదైనా
ధ్యేయం మిక్కిలి ఉన్న
ప్రజోపకారి పేపర్ బాయ్.

* * * *
జన జాగృతికై
పరితపించే బంధువు
సంవత్సరం శ్రమించినా
సన్మానం పొందని భానుడు.