ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నాన్నంటే... ------------ తల్లి గర్భగుడిలో ఊపిరుపోసుకొన్న బిడ్డ తండ్రి గుండెల మీద నిద్రపోతుంది. తప్పటడుగుల వేళ నిన్నునడిపించిన మార్గం. నాన్నంటే జ్ఞాపకం నాన్నంటే చేయూతకు అర్థం తను ఒరిగిపోతూ బిడ్డను నిలబెట్టే మహావృక్షం బిడ్డలకు ఫలాలు ఇచ్చి నీడనిచ్చి చల్లగాలిని ఇచ్చి తను మాత్రం ఎండకు వానకు తుపానులకు ఎదురునిలిచి బిడ్డలను కాచుకునే ఇల దైవం అనురాగానికి నాన్న రాగం మమకారానికి నాన్న శ్రీకారం నాన్నంటే నీకు బాధ కలిగినప్పుడు నీ కంట్లో నిలిచే కన్నీరు నీ నవ్వులో కొలువై నీకు తోడుగా నిలిచిన పేరు నాన్నంటే దేవుడికి మరోపేరు ....తేజారాణి తిరునగరి
June 22, 2020 • T. VEDANTA SURY • Poem