ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నాన్న పచ్చి అబద్ధాలకోరు కవితాసంపుటికి సుందరాచారి పురస్కారం !--రెండు తెలుగు రాష్ట్రాల్లోని కవులను,రచయితలను ప్రోత్సహించాలన్న సదాశయంతో సుందరాచారి స్మారక పురస్కారాలకు ఆయా కవుల,రచయితలనుండి కవితాసంపుటాలు ,కథాసంపుటాలు,నవలలు,బాలసాహిత్య పుస్తకాలు, గజల్ సంపుటాలు,విమర్శ గ్రంథాలు ఆహ్వానించారు." నాన్న పచ్చి అబద్ధాలకోరు " కవితాసంపుటి సుందరాచారి పురస్కారానికి ఎంపికైనట్లుకరోనా పరిస్థితులు అనుకూలించాక హైదరాబాదులో పురస్కారంతో ఘనంగా సన్మానించడం జరుగుతుందనిడా" కందేపిరాణి ప్రసాద్ ఛైర్మన్, శ్రీ అంగలకుదిటి సుందరాచారి చారిటీస్ వారు తెలియజేశారు. పుస్తక రచయిత శ్రీ సురేంద్ర రొడ్డ గారు చిత్తూరు జిల్లాలోని జి.ప.ఉన్నత పాఠశాల, వడమాలపేటలోసాంఘికశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ప్రవృత్తిరీత్యా సాహితీసేవ చేస్తున్న రచయిత, కవి,గాయకుడు,నటుడు, ఉపాధ్యాయుడు శ్రీ సురేంద్ర రొడ్డ గారిని ఉపాధ్యాయ బృందం , సాహితీ అభిమానులు,సాహితీవేత్తలు అభినందించారు.
July 29, 2020 • T. VEDANTA SURY • News