ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నామని సుజనాదేవి కి బహుమతి : మాడిశెట్టి గోపాల్
September 12, 2020 • T. VEDANTA SURY • News

నామని సుజనాదేవి కి జి.వి. ఆర్ కల్చరల్ ఫౌండేషన్ వారి జాతీయ స్థాయి కథా సంపుటాల పోటీలలో ప్రథమ బహుమతి.ప్రముఖ కథా రచయిత్రి నామనీ సుజనాదేవి ఇటీవల సమైక్య సాహితి ద్వారా వెలువరించిన *స్పందించే హృదయo* కథాసంపుటికి జి.వి.ఆర్ కల్చరల్ ఫౌండేషన్ మరియు త్యాగరాయ గాన సభ వారి 2019 జాతీయ స్థాయి కథాసంపుటాలు పోటీలలో ప్రథమ బహుమతి గెలుచుకుంది.  అక్టోబర్ 1వ తేదీన త్యాగరాయగానసభలో జరిగే కార్యక్రమంలో ఆమెకు పురస్కారం కింద రెండు వేల ఐదు వందల నగదును అందజేయనున్నారు.  గతం లో  ఈ సంపుటి సుందరాచారి స్మారక పురస్కారాన్ని కూడా గెలుచుకుంది.  ఈమేరకు  నిర్వాహకులు ఆమెకు వర్తమానం అందించారు.  ఈ కథా సంపుటికి గతం లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా రావడం విశేషం. నూట ఎనిమిది కథలతో సరస్వతీదేవికి అక్షరార్చన చేసిన బృహత్ గ్రంథం ఇది. గతం లో ఈ రచయిత్రికి అంపశయ్య నవీన్ గారి నవలల పోటీలో ప్రథమ బహుమతి రావడం అందరికీ తెలిసిన విషయమే. ఉద్యోగరీత్యా కరీంనగర్ ఎల్ఐసి లో అధికారిణిగా పనిచేస్తున్న సుజనాదేవి మరిన్ని మంచి రచనలు చేయాలని ఆకాంక్షిస్తూ సమైక్య సాహితీ అధ్యక్ష కార్యదర్శులు మాడిశెట్టి గోపాల్ కే.ఎస్.అనంతాచార్య, సాహితీ గౌతమి అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, గాజుల రవీందర్ లతో పాటు జిల్లా రచయితలు, రచయిత్రులు, వివిధ సాహితీ సంస్థల బాధ్యులు బంధువులు  అభినందనలు తెలిపారు.