ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నాయనకు -వందనం......: --డాక్టర్ .కె .ఎల్వీ .-హనంకొండ.
November 13, 2020 • T. VEDANTA SURY • Poem

ఆయన 
అడుగుల చప్పుడు 
వినబడితే చాలు,
సరీసృపాలు సయితం ,
పక్క కు తప్పుకుని 
ప్రణమిల్లుతాయి !

అయన స్వరం 
వినికిడికి 
పిల్ల ..పెద్ద 
ఆడ ..మగా 
తేడాలేకుండా ,
మర్యాద సూచకంగా 
లేచి నిలబడి ,
చేతులెత్తి 
నమస్కరిస్తారు !

గ్రామంలో ...
ఎలాంటి తగువు 
ఉత్పన్నమైనా ,
తుది తీర్పు 
ఆయనదే !

క్రమశిక్షణ ..ఆయన ,
పుట్టుకతోనే 
అలవర్చుకున్న 
గొప్ప శిక్షణ !
ఇంటా ..బయట ,
అదేఆయనకు ,
పక్షపాతం లేని ,
ఆయుధం అయింది !

దారి తప్పి
అల్లకల్లోల మయిన 
అనేక 
సంసార నౌకలకు 
మార్గదర్శనం 
చేయించిన 
మహనీయుడు 
అయన !

ఆయనే 
మా నాయన !
మా భవితకు 
బంగరు బాట వేసి ,
ఫలాలు 
రుచి చూడకుండానే ,
భువి నుండి 
దివికేగిన ,
పుణ్య మూర్తి ..
మా ..నాయన !!