ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నా దేశంలో --- బాలవర్దిరాజు మల్లారం
September 23, 2020 • T. VEDANTA SURY • Poem

నా దేశంలో 
మూఢ నమ్మకాలలో భారతీయత 
మూఢాచారాలలో శాస్త్రీయత 
మూర్ఖ భక్తిలో వాస్తవికత 
మనుషుల్లో నైతికత 
సంసారాలలో ప్రశాంతత
బంధువులలో ఆప్యాయత 
స్నేహాలలో సహాయత
ప్రేమలలో స్పష్టత
మాటలలో ఆత్మీయత
విద్యలో నిపుణత
వైద్యంలో మానవీయత 
విద్యార్థులలో విధేయత 
ఉద్యోగులలో బాధ్యత
సాహిత్యంలో దార్శనికత 
రాజకీయాలలో సేవాతత్పరత 
వస్తువులలో నాణ్యత
వాతావరణంలో స్వచ్ఛత
మతాలలో సమానత
కులాలలో సమైక్యత 
కవిత్వంలో నవ్యత 
మృగ్యం,పూజ్యం .
ఎటు పోతుంది నా దేశం?
ఏమై పోతుంది నా దేశం??