ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నా ప్రియమైన మొలక దోస్తులారా.శుభోదయం పలుకుతున్నాడు మీ సంతోష్ బాబు మామయ్య.ఇక మన పీవీ తాత గురించి కొన్ని ముచ్చటలు.వేలేరు గ్రామంలో ప్రాథమిక విద్య తర్వాత, ఆయన ఉన్నత పాఠశాల లో చేరేందుకు వరంగల్ వెళ్లినారు.అక్కడ వారి దగ్గరి బందువుల ఇంట్లో బస.మొదట్లో వరంగల్ అంటే ఓ విచిత్ర నగరంగా తోచినా మెల్లగా అలవాటై పోయింది.అక్కడ పాఠశాలలో మంచి తెలివైన విద్యార్థి గా పేరు తెచ్చుకున్నాడు.పాఠ్యపుస్తకాలతో పాటు లైబ్రరీలో పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నారు.అందులో అధికంగా ఉర్దూ పుస్తకాలు.కొన్ని మాత్రమే ఆంగ్ల పుస్తకాలు,తెలుగు పుస్తకాలు.జవహర్ లాల్ నెహ్రూ ఇంగ్లీష్ లో రాసినడిస్కవరీ ఆఫ్ఇండియా అనే పుస్తకం చదివాడు.ఆ పుస్తకం తనపై చాలా ప్రభావం చూపించినది అని తర్వాత చెప్పారు పీవీతాత.ఆ గ్రంథాలయం లో లైబ్రేరియన్ ముస్లిం వ్యక్తి.అతని ద్రుష్టిలో నెహ్రూ ఒక విప్లవకారుడు.తిరుగుబాటు దారుడు.అందువల్ల పీవీతాత గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఫిర్యాదుచేశాడు.హెడ్మాస్టర్ పివిని పిలిపించి అడిగాడు.పీవీ తాను ఆ పుస్తకం చదివినట్లు ఒప్పుకున్నాడు.ఒక వేళ నెహ్రూ విప్లవకారుడు ఐతే ఆయన పుస్తకం లైబ్రరీలో ఎందుకు పెట్టినారు అని అడిగాడు బాల పీవీ.లైబ్రేరియన్ ఏదో చెప్పాలను కున్నాడు.ప్ర ధానోపద్యాయుడు అతనిని వెళ్లిపొమ్మని చెప్పారు.ఆ తర్వాత పీవీ తో నీవు పుస్తకాలు చదవడం మంచి పని.కానీ చదువును నిర్లక్ష్యంగా చూడకు.పుస్తకాలు చదివితే లోక జ్ఞానం పెరుగుతుంది.అని సలహాఇచ్చారు.అందుకని మిత్రులారా.మీరుకూడా పుస్తకాలుచదవడంప్రారంభించండి.ఇక ఉంటాను.సరేనా
June 30, 2020 • T. VEDANTA SURY • Serial