ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నా ప్రియమైన మొలక మిత్రులారా.జేజేలు.నిన్న మనం పీ.వీ.తాత లక్నేపల్లి గ్రామంలో ఇరవైఎనిమిది జూన్ 1921నాడు జన్మించినట్లు చెప్పుకున్నాం కదా.మరి ఆయన స్వగ్రామం ఏ ఊరు.?కరీంనగర్ జిల్లా లోని వంగర గ్రామంలో ఆయన పెరిగినాడు.ఈ ఊరు భీమదేవర పల్లి మండలం లో ఉంది.ఆయన తండ్రి పేరు పాములపర్తి వేంకట సీతా రామారావు.తల్లి పేరు రుక్మిణి.పి.వి.తాతకు ఒక అక్క సరోజనీ దేవి ఇద్దరు తమ్ముళ్ళు మాధవ రావు,మనోహర్ రావులు.ఆ ఊరిలోనే వీరి పొరుగు ఇంట్లో పాముల పర్తి వేంకట రంగారావు, రత్నాబాయి దంపతులు ఉన్నారు.వారు పెద్ద భూస్వాములు.గ్రామ కరణాలు.వారికి సంతానం లేదు.రంగారావు అనారోగ్యంతో చిన్న వయసులోనే మరణించారు.అందువల్ల రత్నాబాయి కి ఒక దత్తపుత్రుడు అవసరం అయ్యాడు.కొంతమంది శ్రేయోభిలాషుల సలహా పై మన పీవీ తాత ను పెంపకానికి తీసుకుంది రాత్నా బాయి.అంటే మన పీవీ తాత ఇద్దరు అమ్మల ముద్దుల కొడుకు గా పెరిగాడన్న మాట.ఇక మిగతా ముచ్చట్లు రేపు.సరేనా.-కె . వి. సంతోష్ బాబు
June 22, 2020 • T. VEDANTA SURY • Serial