ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నా ప్రియమైన మొలక మిత్రులారా.నిన్న మనం లంకాదహనం హరికథ గురించి తెలుసుకున్నాం కదా.!ఈరోజు మరికొంత.పీవీ గారింటి వెనుక చాలా విశాలమైన పెరడు ఉండేది. ఇంటికి దగ్గరగా చేదబావి.దానికి దగ్గరగా మట్టిగోడలతో స్నానాలగది.బావికి కొంచెం దూరంలో ఒక రాళ్లతోకట్టిన కట్టెల పొయ్యి.దానిపై ఒక పెద్ద కొప్పెర .బావి దగ్గరగా ఒక ఇత్తడి గంగాళం.నిండా నీళ్ళు.ఇంకా కొంచెం దూరంలో ఒక వరిగడ్డివాము.(పశువుల మేత కోసం)హరికథ విన్న తెల్లవారి చిన్న పీవీ తాతను స్నానంచేయించేందుకు తీసుకుని వచ్చింది పనిమనిషి.బాలుడు పీవీకి ఇంకా లంకాదహనం మదిలో మెదలుతుంది.అక్కడ కొంత దూరంలో ఒక చీకి పోయిన చాంతాడు కనిపించింది.ఇంకేం దానిని వెనుక తోక లాగా పెట్టుకుని తాను ఆంజనేయస్వామి వేషం వేసాడు.మండుతున్న పొయ్యి లో తోక మరోభాగం అంటించాడుజై శ్రీరాం అంటూ వెళ్లి గడ్డివాముకు నిప్పుపెట్టాడు.మంటలనుచూసి సంబరపడ్డాడు.ఇంతలో పనిమనిషి వచ్చిందిమంటలనుచూసింది.బిగ్గరగా అరిచింది.ఆ అరుపులువిని ఇతర మగ పని మనుషులు వచ్చి గంగాళం లోని నీళ్ళతో చల్లార్చారు.ఈ గొడవతో పీవీ తాత భయంతో అమ్మ కొంగుచాటున చేరాడు.అమ్మ ఎమంటుంది.అయ్యో నా బంగారుతండ్రి.నీకేం కాలేదుకదా.అంతే చాలు.ఇకముందు మాత్రం ఇలా నిప్పుదగ్గరగా వెళ్లకు అని బుజ్జ గించింది.అమ్మ మనసు ఎప్పుడూ నవనీతమేకదా.!ఐతే నాచిన్నారి మిత్రులారా.మీరు మాత్రం ఎప్పుడూ ఇలాంటి సాహసాలు చేయకండి.అపాయాలకు దూరంగాఉండాలని ఈ సంఘటన నీతి.మళ్ళీ రేపు మరో ముచ్చటతో వస్తాడు మీ సంతోష్ బాబు మామయ్య.
June 26, 2020 • T. VEDANTA SURY • Serial