ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నా ప్రియమైన మొలక మిత్రులారా.మన పీవీ తాత శతజయంతి వేడుకల సందర్భంగా మీకు జేజేలు.ఈరోజు దేశమంతా ఆనందోత్సాహాలతో జయంతికార్యక్రమాల లో పాల్గొన్నారు.పల్లె నుంచి పట్నందాకా వారి వారి స్తాయిని బట్టి జరుపుకున్నారు.తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్గారు ఏడాదిపాటు జరుపుకొనే ప్రణాలికను సిద్దంచేశారు.ప్రధానిమోడీగారు తన మన్ కీ బాత్ లో పీవీ కి ఘనంగా నివాళులు అర్పించారు.కరీంనగర్ లో పీవీ సాహిత్య పీఠం రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.ఇరవైమంది యువకులు రక్తదానం చేశారు.రక్తదానం చాలా మంచి పని.జీవితాన్ని దానంచేసినట్లే.మీరుకూడా మంచి ఆరోగ్య వంతంగా ఉండాలి.పెద్దయాక అపుడపుడు రక్తదానం చేయాలి.మానవత్వాన్ని చాటుకోవాలి.పీవీ గారి గురించి రేపు.టా.టా.అంటున్నాడు మీ సంతోష్ బాబు మామయ్య.
June 29, 2020 • T. VEDANTA SURY • Serial