ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నా ప్రియమైన మొలక మిత్రులారా.మీ సంతోష్ బాబు మామయ్య మీకు జేజేలు పలుకు తున్నాడు. ఈరోజు మనం పీవీ తాత బాల్యం లోని ఒక సంఘటన గురించి చెప్పుకుందాం.ఆయన సుమారునాలుగు ఏళ్ల వయస్సు లో ఉన్న ప్పుడు ఉదయం పూట తన ఇంటిముందున్న వాకిట్లో ఆడుకుంటున్నాడు.అప్పుడు ఒక ఫకీరు వచ్చి యాచన చేశారు.గ్రామాల్లో ఫకీరులు హరిదాసులు,ఇతరులు వచ్చి ఇంటింటా యాచన చేయడం మామూలే.అతణ్ని చూసి మన బుల్లి పీవీ తాత ఇంట్లోకి వెళ్లి గుమ్మి లోని వడ్లు ఒక సోల లో తెచ్చి అయన జోలె లో వేసాడుసాధారణంగా ఆపని ఇంట్లోపనిమనుషులుగాపనిచేస్తున్న వాళ్లు చేసేవారు.ఈలోగా పొలానికి వెళ్లిన పీవీ తాత బాపు సీతారామా రావు ఇంటికి తిరిగి వచ్చాడు.అతణ్ని చూసిన ఆ ఫకీరు తన భాషలో ఆశీర్వదించారు.అతర్వాత అయ్యా!మీ అభ్భాయి ముఖంలో అనూహ్యమైన తేజస్సు ఉంది.ఇతను మహార్జాతకుడు.భవిష్యత్తు లో చాలా గొప్ప వ్యక్తి అవుతాడు అన్నాడట.అది విన్న ఆ తండ్రి మనసులో ఆనందం కలిగిందట.తన కొడుకు పెద్దయ్యాక ఏ డిప్యూటీ తహసీల్దార్ లేదా తహసీల్దార్ గా ఉద్యోగం పొందవచ్చు అని మురిసి పోయాడట.కానీ మన పీవీ తాత ఏకంగాదేశ ప్రధానమంత్రి పదవి పొంది విశ్వ విఖ్యాతి పొందినాడు.ఇక సెలవు.మళ్లీ రేపు మరో ముచ్చట.సరేనా.
June 24, 2020 • T. VEDANTA SURY • Serial