ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నా ప్రియమైన మొలక మిత్రులారా.శుభోదయం.కుగ్రామం ఐన వంగర లో విద్యాసౌకర్యాలు లేనందున మన బాల పీవీ తాత ,తన అక్క గారైన శ్రీమతి బొప్పరాజు సరోజనీదేవి ఊరు వేలేరు లో ప్రాథమిక విద్య చదువాల్సి వచ్చింది.అంత చిన్న వయసులోనే తల్లితండ్రుల నుంచి దూరంగా వెళ్ళడం బాధ కరమే.తల్లి రుక్మిణి బాయి కి ఇష్టం లేదు.ఏదో తనకున్న పన్నెండు వందల ఎకరాలభూమిని సేద్యం చేసుకుంటూ, గ్రామ కరణం గా రెవిన్యూ లెక్కలు రాసుకుంటే సరిపోతుంది కదా అని ఆమె వాదన.తల్లిప్రేమ అంతే.కానీ తాను చదువుకోసం ఏ కష్టాలు ఐనా స్వీకరిస్తాని మొండి పట్టు పట్టాడు బాల పీవీ.ఒక వైపు మా తృ ప్రేమ మరోవైపు ఉన్నత చదువుల పై మమకారం.చదువు వైపే మొగ్గుచూపు.వేరలేరు కు ఎడ్ల బండి పై ప్రయాణం.మొదటి సారి తండ్రి సీతారామారావు వెంట వెళ్లినాడు.అక్కడ తోటివిద్యార్థులు అందరిలో ప్రథముడు అతనే.ఉర్దూ మాద్యమం లో బోధన. ఆతరువాత హైస్కూలు చదువుకోసం వరంగల్ లో దగ్గర బందువుల ఇంట్లో మకాం.వాళ్లు ఎంత బాగా చూసుకున్నా తల్లితండ్రుల ప్రేమ ఎవరు ఇస్తారు?.అందుకే ఆయనలో ఒక మౌని లక్షణాలు అలవాటు అయ్యాయి.అతను లోపలి మనిషి గా మారేందుకు అంకురార్పణ జరిగింది.ఇక మిగతా రేపుసరేనా.మీకు శుభకామనలు చెబుతున్నాడు మీ సంతోష్ బాబు మామయ్య .
June 27, 2020 • T. VEDANTA SURY • Serial