ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నా ప్రియ స్నేహితులారా.శుభోదయం.ఈరోజు తెలుగు జాతి గర్వించదగ్గ రోజు.మన పీవీ తాత నూరవ పుట్టినరోజు.మనం వేడుకల్ని చేసుకోవలసిన రోజు.నూరేళ్ళ క్రితం ఒక కుగ్రామం లో జన్మించిన వ్యక్తి ఇంతింతై వటుడింతై నట్లు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందినాడు.మన దేశాన్ని అభివృద్ధి మార్గాలలో నడిపే తొలి అడుగు వేశాడు.సుమారు పదిహేడు భాషల్లో ప్రావీణ్యత పొంది మనిషి తలచు కుంటే అసాధ్యం ఉండదు అని నిరూపించారు.ఒక దేశం అభివృద్ధి చెందాలంటే సాంకేతికపరిజ్ఞానం అవసరం అని గుర్తించి ఆ దిశగా కార్యక్రమాలుచేపట్టారు.ఇప్పుడు ప్రపంచంలో అన్ని ధనిక దేశాలలో భారతీయులు ఐ.టీ.రంగంలో ముందు వరుసలో ఉన్నారు అంటే దానిని మన పీవీ తాత రూపొందించినవిధానాలే కారణం.అందుకని నా ప్రియ మైన మొలక మిత్రులారా.ఈ రోజు మీ ఇంట్లో నే పండుగ జరుపుకోండి.పీవీ తాత కు జేజేలు చెప్పండి.సరేనా.
June 28, 2020 • T. VEDANTA SURY • Serial