ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నింబార్కాచార్యుడు..!'---సుజాత.పి.వి.ఎల్.
September 24, 2020 • T. VEDANTA SURY • Story

బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు రాసిన మహనీయులలో ఒకడు నింబార్కాచార్యుడు.
ఇతని జన్మస్థానం బళ్ళారిలోని నింబ గ్రామమనీ అందుకే ఇతనికి నింబార్కుడని పేరు వచ్చిందనీ అంటారు కొందరు. మరొక ఊహ ప్రకారం ఇతనిది గోదావరీ తీరప్రాంతం. ఇతని జనన కాలం కూడా కచ్చితంగా తెలియదు. 11వ శతాబ్దం వాడని ఒక వాదమైతే 13 వ శతాబ్దమని మరికొందరి లెక్క. ఇతడి తల్లిదండ్రులు జగన్నాథుడు, సరస్వతి.
వీరిది వైష్ణవసాంప్రదాయంలోని సనక సాంప్రదాయం. అనగా సనక మహర్షి నెలకొల్పిన సంప్రదాయం. వేదాంతపరంగా ఇతనిది ద్వైతాద్వైతం.
బ్రహ్మసూత్రాలకు నింబార్కుడు వ్రాసిన భాష్యం పేరు "వేదాంత పారిజాత సౌరభం". దీనిని అర్థం చేసుకోవటానికి ఆయన శిష్యుడైన శ్రీనివాసాచార్యుడు "వేదాంత కౌస్తుభం" అనే వ్యాఖ్యానం వ్రాయవలసి వచ్చింది. దీనిని మరింత సుబోధకం చేయటానికి కేశవ కాశ్మీరీభట్టు "వేదాంత కౌస్తుభ ప్రభ" అనే మరొక వ్యాఖ్యాన గ్రంథం వ్రాసాడు.