ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నిజాయితీ బాలుడు :-పూసాల సత్యనారాయణ --హైదరాబాద్ సెల్ నంబర్ 9000792400
September 12, 2020 • T. VEDANTA SURY • Story

ఒక గ్రామము లో  రామయ్య మల్లమ్మ దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ పనులు చేసుకొనుటకు భూమి లేదు.ఆస్తులు కూడా లేవు.నిరక్ష రాస్యు లైన వారికి ఎక్కడకు పోయిన సరైన గుర్తింపు లేకుండా మోసాలకు గురి అయ్యే వాళ్ళు.చదువు లేక జీవితమే అందకారమైనదని కుమిలిపోతూ వుండేవారు. దీనికంతటికీ నిరక్ష రాస్యత కారణమని తెల్సు కొని తన కొడుకు రాజేష్ ఉజ్జ్వల భవిష్యత్తు కు చదువు బా ట పట్టించినాడు. బీదరికాన్ని రూపుమాపాలని దృఢముగా నిశ్చ యించు కున్నారు. కూలివాని కొడుకుగా  రాజేష్ అవమానాలకు గురి అయిన  చదువులో అందరికన్న ముందు వుండి ఫస్ట్ మార్కులు తెచ్చుకొని అందరి మన్ననలను పొందేవాడు   .తెలివైన  వాడుగా వున్నందున తల్లి దండ్రులు సంతోషించే వారు.8వ తరగతి చదువుతున్న రాజేష్ కు  ఆటలంటే ఇష్టమే గాక ఎన్నో బహుమతులు గెలుచుకు న్నాడు  .ఒక రోజు ఇంటికి తిరిగి వెల్లుతుండగా రోడ్డుపై దొరికిన బ్యాగును ఇంటికి తీసుకొని పోయినాడు.తోటి విద్యార్థులు నాదంటే నాదని గొడవ చేసినా అందరినీ విదలించు కొని వచ్చి తల్లిదండ్రులకు అందచేసి నాడు. దానిని తెరచి నివ్వెర పోయినారు.డబ్బు కట్టలు మరియు బ్యాంక్ పాస్ బుక్ చూసి దురాశ కు గురి కాకుండా మరునాడే ప్రధానోపాధ్యాయుడకి అందచేసినారు. పది లక్షలు పోగొట్టు కున్నవారిని పిలిపించి వారి డబ్బును వారికి రాజేష్ బాలుడి చేత  అంద చేయించినారు.   బాలుడి నిజాయితి ని  తల్లిదండ్రుల మంచి తనము ను మెచ్చి అభినందించి పదివేల రూపాయలు బహుమానంగా కూడా ఇచ్చినారు. తోటి విద్యార్థులు ఉపాధ్యాయులు చప్పట్ల తో ముంచెత్తి నారు. భీదవాడైన రాజేష్ నిజాయితీ అందరికీ స్ఫూర్తి.